బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన హీరోలలో కార్తీక్ ఆర్యన్(Karthik aryan) ఒకరు. ఈ మధ్యకాలంలో వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈయన సత్య ప్రేమ్ కి కథ(Sathya Prem Ki Katha) అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కియారా అద్వానీ(Kiara Advani) నటించారు.

బాలీవుడ్(bollywood) లో యంగ్ స్టార్ , హ్యాండ్సమ్ స్టార్స్ అంటే ముందుగా కార్తీక్ ఆర్యన్(Karthik Aryan) పేరు వినిపిస్తుంది. తాజాగా ఎదురుదెబ్బలు తిన్న కార్తీక్ ఆర్యన్.. కాస్ట్లీ ఇల్లు(House) కొన్నాడట. ఇంతకీ ఆఇంటి ఖరీదు ఎంతో తెలుసా..?

బాలీవుడ్ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందిన హీరోలలో కార్తీక్ ఆర్యన్(Karthik aryan) ఒకరు. ఈ మధ్యకాలంలో వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఈయన సత్య ప్రేమ్ కి కథ(Sathya Prem Ki Katha) అనే సినిమా ద్వారా ప్రేక్షకులను మెప్పించారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ కి జోడిగా కియారా అద్వానీ(Kiara Advani) నటించారు. అంతకు ముందు అలవైకుంటపురములో(Ala Vaikuntapuramulo) సినిమాను హిందీలో తీసి నష్టపోయాడు కార్తీక్ ఆర్యన్. లాస్ నుంచి బయట పడేలా చేసింది సత్య ప్రేమ్ కి కథ. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయనకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక బాలీవుడ్ స్టార్స్ ఈమధ్య వరుసగా సొంతింటివారు అవుతున్నారు. ఆల్ రెడీ ఇళ్ళు ఉన్నా కూడా.. మరికొన్ని ఇళ్ళు కొనేస్తున్నారు. ఆమధ్య జాన్వీ కూపూర్(Janhvi Kapoor) కూడా కోట్లు పెట్టి అపార్ట్ మెంట్ కొనేసింది. తాజాగా కార్తీక్ ఆర్యన్ కూడా కొత్తిల్లు కోన్నాడట. ఈ క్రమంలోనే నటుడు కార్తీక్ ఆర్యన్ సైతం ముంబైలోని(Mumbai) జూహు(Juhu) ప్రాంతంలో ఖరీదైన అపార్ట్మెంట్(Apartment) కొనుగోలు చేశారని తెలుస్తోంది. కార్తీక్ కొనుగోలు చేసిన ఈ అపార్ట్మెంట్ ఖరీదు 17.50 కోట్ల రూపాయలని ఉంటేందట. జూహూ అంటేనే ముంబయ్ మొత్తం మీద అత్యంత ఖరీదైన ప్రాంతం.

అన్ని సౌకర్యాలతో.. ఎంతో విలాసవంతమైన ఈ ప్లాట్ ను కార్తీక్ ఆర్యన్ జూన్ 30వ తేదీ కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఇక కార్తీక్ తల్లి ఈ ఫ్లాట్ కొనుగోలు చేయడానికి డీల్ కుదిర్చినట్టు సమాచారం. ఇలా ఈయన ముంబైలోని టాప్ సెలబ్రిటీలు కొనుగోలు చేసిన ప్రాంతంలో ఖరీదైన ఆస్తిని కొనుగోలు చేశారని తెలిసి అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈయన ప్రస్తుతం కెప్టెన్ ఇండియా అనే సినిమాలో నటిస్తున్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది

Updated On 9 July 2023 1:04 AM GMT
Ehatv

Ehatv

Next Story