ఒకప్పటి తమిళ హీరో శివకుమార్‌(Shivakumar) కుమారులు సూర్య(Surya), కార్తీలిద్దరూ(Karthi) సినీరంగంలో తండ్రి పేరు నిలబెడుతున్నారు. కార్తీ అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలు విజయవంతమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో విరుమాన్‌(Viruman), పొన్నియిన్‌ సెల్వన్‌(Poniyyin Selvan), సర్ధార్‌(Sardar) లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలలో ఆకట్టుకున్నారు. లేటెస్ట్‌గా కార్తీ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం జపాన్‌ షూటింగ్ పూర్తయింది.

ఒకప్పటి తమిళ హీరో శివకుమార్‌(Shivakumar) కుమారులు సూర్య(Surya), కార్తీలిద్దరూ(Karthi) సినీరంగంలో తండ్రి పేరు నిలబెడుతున్నారు. కార్తీ అయితే వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన నటించిన చిత్రాలు విజయవంతమవుతున్నాయి. ఈ మధ్య కాలంలో విరుమాన్‌(Viruman), పొన్నియిన్‌ సెల్వన్‌(Poniyyin Selvan), సర్ధార్‌(Sardar) లాంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలలో ఆకట్టుకున్నారు. లేటెస్ట్‌గా కార్తీ హీరోగా నటిస్తున్న 25వ చిత్రం జపాన్‌ షూటింగ్ పూర్తయింది. చివరి పాటని ఇటీవలే కశ్మీర్‌లో చిత్రీకరించారు. ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. ప్రస్తుతం కార్తీ నలన్‌ కుమారసామి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇది కార్తీకి 26వ సినిమా అవుతుంది. ఇందులో కృతిషెట్టి(Krithi shetty) హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై కేఈ జ్ఞానవేల్‌ రాజా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, తమిళ దిగ్గజ నటుడు ఎంజీఆర్‌ వీరాభిమానిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ చిత్రానికి వా వాద్ధియారే అనే టైటిల్‌ను ఖరారు చేశారట!. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది. సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా షూటింగ్ చైన్నె పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. దీని తర్వాత 96 ఫేమ్‌ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో కార్తీ నటించనున్నాడు. ఇందులో అరవిందస్వామి కీలకపాత్ర చేయబోతున్నాడు. సంగీతాన్ని గోవింద్‌ వసంత అందిస్తుననాడు. పీసీ శ్రీరామ్‌ సినిమాటోగ్రఫీ అందిస్తారు. ఈ చిత్రాన్ని కార్తీ అన్న సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. దీని తర్వాత సర్దార్‌ 2, ఖైదీ 2 చిత్రాల్లో కార్తీ నటించనున్నాడు

Updated On 1 Sep 2023 8:29 AM GMT
Ehatv

Ehatv

Next Story