సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా కష్టం. సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించినంత మాత్రాన స్టార్‌ హీరోయిన్‌ హోదా రాదు, అదృష్టం కూడా ఉండాలి. బాలీవుడ్‌లో ఇలాంటి తారలు చాలా మందే ఉన్నారు. అగ్రహీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా పారితోషికాలను అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం తక్కువే ఉన్నారు. ఇలాంటి వారిలో మొదట వినిపించే పేరు కరీనా కపూర్‌(Kareena Kapoor).

సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్‌గా ఎదగడం అంత ఈజీ కాదు. ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో చాలా కష్టం. సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించినంత మాత్రాన స్టార్‌ హీరోయిన్‌ హోదా రాదు, అదృష్టం కూడా ఉండాలి. బాలీవుడ్‌లో ఇలాంటి తారలు చాలా మందే ఉన్నారు. అగ్రహీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా పారితోషికాలను అందుకుంటున్న హీరోయిన్లు మాత్రం తక్కువే ఉన్నారు. ఇలాంటి వారిలో మొదట వినిపించే పేరు కరీనా కపూర్‌(Kareena Kapoor). బాలీవుడ్‌లో కరీనా కపూర్ నటించిన సినిమాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి. బాలీవుడ్ చరిత్రలో మరే ఇతర హీరోయిన్ల సినిమాలు ఆమెను అధిగమించలేకపోయాయి. కరీనా నటించిన సినిమాలు బాక్సాఫీసు దగ్గర నాలుగు వేల కోట్ల రూపాయల గ్రాస్‌ వసూళ్లు సాధించాయంటే ఆమె రేంజ్‌ ఏమిటో అర్థమవుతోంది. ఆమె నటించిన 23 సూపర్‌హిట్‌ సినిమాల కలెక్షన్లు చూస్తే బాలీవుడ్‌ స్టార్లు కరిష్మా, కత్రినా, రాణి ముఖర్జీ, కాజోల్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ, దీపికా పడుకొనే కూడా ఈమె దరిదాపుల్లో లేరు. కరీనా కపూర్‌ నటించిన 23 సినిమాలలో బజరంగీ భాయిజాన్‌(Bajrangi Bhaijaan), త్రీ ఇడియట్స్‌(3 idiots) ఆల్‌ టైమ్‌ బ్లాక్‌బస్టర్లుగా నిలిచాయి. బజరంగీ భాయిజాన్‌ ఒక్కటే వరల్డ్‌ వైడ్‌గా 918 కోట్ల రూపాయలను వసూలు చేసింది. అలాగే కభీ ఖుషీ కభీ గమ్‌, ఐత్రాజ్‌, జబ్‌ వీ మెట్‌, బాడీగార్డ్‌, గుడ్‌ న్యూస్‌ వంటి విజయవంతమైన సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని సూపర్‌హిట్స్‌ కలిపి ప్రపంచవ్యాప్తంగా నాలుగు వేల కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టాయి. కరీనా తర్వాత మూడు వేల కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించిన హీరోయన్లలో దీపికా పడుకొనే, అనుష్క శర్మ ఉననారు. దక్షిణాదిలో బాహుబలి సినిమాతో అనుష్క షెట్టి, తమన్నా భాటియా ఈ లిస్టులో వచ్చారు. బాహుబలి బాక్సాఫీస్ దగ్గర 2400 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత 2000 కోట్ల రూపాయలకు పైగా లిస్ట్‌లో ఐశ్వర్య రాయ్, అలియా భట్, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్, నయనతార నిలిచారు. అంతే కాకుండా ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా కూడా 2024 కోట్ల రూపాయలు వసూలు చేసిన దంగల్‌ చిత్రం ద్వారా ఈ జాబితాలోకి వచ్చారు.

Updated On 6 Sep 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story