బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కరీనా కపూర్‌ల(Kareena Kapoor) మధ్య నీళ్లు పోసినా పెట్రోల్‌లా మండుతుంది. ఇద్దరి మధ్య అంతటి శత్రుత్వం ఉందని బాలీవుడ్‌లో చెప్పుకుంటుంటారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఆ మధ్యన ఐత్రాజ్(Aitraaz) అనే సినిమాలో నటించారు.

Kareena Kapoor-Priyanka Chopra
బాలీవుడ్ హీరోయిన్లు ప్రియాంక చోప్రా(Priyanka Chopra), కరీనా కపూర్‌ల(Kareena Kapoor) మధ్య నీళ్లు పోసినా పెట్రోల్‌లా మండుతుంది. ఇద్దరి మధ్య అంతటి శత్రుత్వం ఉందని బాలీవుడ్‌లో చెప్పుకుంటుంటారు. ఈ ఇద్దరు హీరోయిన్లు కలిసి ఆ మధ్యన ఐత్రాజ్(Aitraaz) అనే సినిమాలో నటించారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడే వీరిద్దరు సెట్‌లోనే అందరి ముందు తెగ కొట్టుకున్నారని అప్పట్లో ఓ వార్త బాగా వినిపించింది. ఆ తర్వాత కూడా వీరిద్దరూ అడపాదడపా గొడవపడ్డారట! ఈ విషయంపై ఇన్నాళ్లుగా ఈ ఇద్దరూ రియాక్టవ్వలేదు. ఇన్నాళ్లకు కరీనాకపూర్ స్పందించారు. ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంకతో గొడవపై మాట్లాడారు.'ప్రియాంక చోప్రాతో నేను గొడవపడినట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. అసలు మా ఇద్దరికీ ఎప్పుడూ గొడవ జరగలేదు. అప్పట్లో వృత్తిపరంగా మా ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండేది. ఇద్దరం నువ్వా నేనా అన్నట్టుగా నటించేవాళ్లం. అందుకు తగినట్టుగానే మా ఇద్దరికీ మంచి పాత్రలు దొరికాయి. మా పోటీని చూసి, మాపై కొందరు లేనిపోనివి సృష్టించి రాసేవారు. అవే నిజమని ఇప్పటికీ కొందరు నమ్ముతున్నారు' అని కరీనా చెప్పుకొచ్చారు. సినిమా అనేది ఓ ఆటలాంటిదని, ప్రతీసారి ఇక్కడ గెలవడం కుదరదని, అప్పుడప్పుడు ఘోరమైన ఓటములు ఎదురవుతాయని కరీనా అన్నారు.
