బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా.. గ్లామర్ కూడా పెంచుకుంటూ వెళ్తోంది కరీనాకపూర్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 ఏళ్ళు అయ్యింది. 20 ఏళ్ళుగా.. గా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసినటించింది కరీనా.. సైఫ్(Saif Ali Khan) తో పెళ్లి.. ఇద్దరు పిల్లల తరువాత కూడా ఆమె ఏమాత్రం తగ్గడంలేదు
కన్నడ స్టార్ హీరో,, కెజియఫ్(KGF) స్టార్ యష్(Yash) పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కరీనా కపూర్(Kareena Kapoor). కెజియఫ్ హీరోపై మనసు పారేసుకుంది కరీనా..
బాలీవుడ్ లో ఏజ్ పెరుగుతున్నా.. గ్లామర్ కూడా పెంచుకుంటూ వెళ్తోంది కరీనాకపూర్. ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా 20 ఏళ్ళు అయ్యింది. 20 ఏళ్ళుగా.. గా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఆల్మోస్ట్ బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కలిసినటించింది కరీనా.. సైఫ్(Saif Ali Khan) తో పెళ్లి.. ఇద్దరు పిల్లల తరువాత కూడా ఆమె ఏమాత్రం తగ్గడంలేదు
ఇక తాజాగా ఆమె ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్(Karan Johar) హోస్ట్ చేస్తున్న కాఫీ విత్ కరణ్(Kofee With Karan) షోలో పాల్గొన్నది. బాలీవుడ్ క్యూట్ బ్యూటీ ఆలియా భట్(Alia Bhatt) తో కలిసి ఈ షోలో సందడి చేసింది కరీనాఇక కరీనా ఈ షోకి వెళ్లిన సందర్భంగా తన కెరీర్ కు సంబంధించిన పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈక్రమంలో కరణ్ జోహార్ కరీనాను కొన్ని ఫన్నీ క్వశ్చన్ అడగడంతో పాటు, మరికొన్ని కోపం తెప్పించే ప్రశ్నలు కూడా వేశారు. అటు కరీనా కూడా కొన్నింటికి సమాధానం చెప్పగా, మరికొన్ని ప్రశ్నలను వదిలేసింది.
అయితే ఈ ప్రశ్నల్లో భాగంగా.. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ఏ హీరోతో నటించాలని అనుకుంటున్నావు? అని కరణ్ అడిగిన ప్రశ్నకు యశ్ అంటూ సమాధానం చెప్పింది. ఆయన నటన తనకు ఎంతో బాగా నచ్చుతుందని వెల్లడించింది. తను నటించిన కేజీఎఫ్ సినిమా ఎంతో బాగా నచ్చిందని చెప్పింది. అవకాశం వస్తే ఆయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉందంటూ వివరించింది. అంతేకాదు తనను కేజీఎఫ్ గర్ల్ అని పిలిపించుకోవాలని ఉందని మనసులో మాట బయట
అంతే కాదు తన భర్త సైఫ్ అలీఖాన్ మొదటి భార్య కుమార్తే.. సారా అలీ ఖాన్(Sara Ali Khan) కు తల్లిగా నటించే ఛాన్స్ వస్తే చేస్తావా అని కరణ్ ప్రశ్నించగా.. తప్పకుండా చేస్తానని కరీనా వెల్లడించింది. తానుకొక నటినని, ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి రెడీగా ఉంటానని చెప్పింది. ఇక మరో ప్రశ్నకు కరీనాకు కోపం వచ్చింది. కరణ్ అడుగుతూ.. రీసెంట్ గా గదర్ 2 పార్టీకి ఎందుకు రాలేదు? అమీషాకు, నీకు మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అని అడిగారు. వెంటనే కరీనాకు బాగా కోపం వచ్చింది. ఆ విషయం గురించి తాను మాట్లాడాలి అనుకోవడం లేదని చెప్పింది.