బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ(Electronic City) జీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీలో(Rave party) నటి హేమ కూడా ఉందంటున్నారు బెంగళూరు పోలీసులు. తాను అక్కడికి వెళ్లనే లేదంటోంది హేమ. పాల్గొన్నదా లేదా అన్నది పక్కన పెడితే ఇదే అదనుగా హేమపై(Hema) విమర్శలు మొదలయ్యాయి. హేమపై కరాటే కల్యాణి(Karate Kalyani) విరుచుకుపడింది.

బెంగళూరు ఎలక్ట్రానిక్‌ సిటీ((Electronic City)) జీఆర్‌ ఫామ్‌హౌజ్‌లో జరిగిన రేవ్‌పార్టీలో(Rave Party) నటి హేమ(Hema) కూడా ఉందంటున్నారు బెంగళూరు పోలీసులు. తాను అక్కడికి వెళ్లనే లేదంటోంది హేమ. పాల్గొన్నదా లేదా అన్నది పక్కన పెడితే ఇదే అదనుగా హేమపై విమర్శలు మొదలయ్యాయి. హేమపై కరాటే కల్యాణి(Karate Kalyani) విరుచుకుపడింది. రేవ్‌ పార్టీలో పాల్గొన్నవారిని శిక్షించాలని చెబుతూ ఆమె చేసింది తప్పని తేలితే మాత్రం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ నుంచి సస్పెండ్‌ చేయమని డిమాండ్‌ చేస్తామని కల్యాణి చెప్పింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌(Movie Artist Assosiation) జాయింట్‌ సెక్రటరీగా ఈ విషయాన్ని మంచు విష్ణు(Manchu Vishnu) దగ్గరకు తీసుకెళతానని తెలిపింది. . 'తప్పు చేసిన వారిని వదిలి పెట్టవద్దు. వారు ఆడ అయినా మగ అయినా. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే. అసలు ఈ రేవ్‌ పార్టీలు పెట్టేవారిని రేవు పెట్టేయాలి. పార్టీ అని పేరు పెట్టి ఇష్టమొచ్చినట్టుగా డ్రగ్స్‌(Drugs) తీసుకుంటూ, పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. యాభై అరవై లక్షల రూపాయలు పెట్టి రేవ్‌ పార్టీలు చేసుకోవడం అంత అవసరమా? మీరు ఎంజాయ్‌ చేయాలంటే ఫ్యామిలీతో కలిసి వెళ్లండి. ఈ పార్టీలు మన సంస్కృతిని నాశనం చేస్తున్నాయి. ఒకరు తప్పు చేసినా ఇండస్ట్రీ మొత్తానికి అంటగడుతున్నారు' అని కల్యాణి వాపోయింది. 'హేమని ఎవరూ ఇరికించలేదు. ఆమె నోట్లో మాట ఆగదు. ఆమె కోపమే ఆమెకి శత్రువు అయింది. అయ్యో హేమక్కా ఇలా అయిపోయావేంటి. నిన్ను చూస్తే జాలేస్తుంది. ఈ కేసు నుంచి హేమ త్వరగా బయటపడాలని కోరుకుంటున్నా. ఆమెకి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తప్పు చేసినందుకు శిక్ష అయితే ఖచ్చితంగా ఉంటుంది. రూల్ ఈజ్ రూల్. రూల్ ఫర్ ఆల్ కాబట్టి హేమని ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేస్తారు. అది మాత్రం నేను చెప్పగలను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

Updated On 22 May 2024 2:41 AM GMT
Ehatv

Ehatv

Next Story