కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ కన్నుమూశారు. ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని

కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ కన్నుమూశారు. ఏప్రిల్ 14, ఆదివారం బెంగళూరులోని తన ఇంట్లో ఆయన శవమై కనిపించారు. రాజాజీనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహాలక్ష్మి పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నివేదికల ప్రకారం ఆత్మహత్య కోణంపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. అంత్యక్రియల నిమిత్తం సౌందర్య జగదీష్ మృతదేహాన్ని ఆయన స్వగృహంలో ఉంచారు. కన్నడ స్టార్ హీరో దర్శన్.. జగదీష్ కుటుంబాన్ని పరామర్శించారు.

కన్నడ నిర్మాత, దర్శకుడు తరుణ్ సుధీర్ తన స్నేహితుడికి ట్విట్టర్ లో నివాళులు అర్పించారు."సౌందర్య జగదీష్ సార్ ఆకస్మిక మరణ వార్త విని దిగ్భ్రాంతికి లోనయ్యాను. కన్నడ చిత్ర పరిశ్రమ ఆయనను చాలా మిస్ అవుతుంది. ఆయన కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను." అని తరుణ్ సుధీర్ తెలిపారు. ఇటీవల.. సౌందర్య జగదీష్ తన జెట్ లాగ్ పబ్ అనుమతించిన సమయానికి మించి నడుపుతున్నట్లు ఆరోపణలు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. పనివేళలకు మించి పార్టీ నిర్వహించినందుకు పబ్‌పై కేసు నమోదైంది. ఈ పార్టీకి ప్రముఖ నటులు దర్శన్, ధనంజయ్, నిర్మాత రాక్‌లైన్ వెంకటేష్ తదితరులు హాజరయ్యారు. విచారణలో దర్శన్‌ను కూడా ప్రశ్నించారు. పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో.. కేవలం విందు ఏర్పాటు చేసిందని, పార్టీ కాదని తెలిపారు. దీంతో ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ ఊరట లభించింది. జగదీష్ 'అప్పు పప్పు', 'స్నేహితారు', 'రామ్ లీల', 'మస్త్ మజా మాడి' లాంటి చిత్రాలను నిర్మించారు.

Updated On 15 April 2024 12:30 AM GMT
Yagnik

Yagnik

Next Story