గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Jr.NTR) నటిస్తున్న దేవర(Devara) సినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది. షషూటింగ్ చివరి దశలో ఉండటంతో.. మూవీ ప్రమోషన్స్ కు పదును పెడుతున్నారు టీమ్. ఇక ఈమూవీ గురించి తారక్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు..

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Jr.NTR) నటిస్తున్న దేవర(Devara) సినిమా రిలీజ్ కు ముస్తాబవుతోంది. షషూటింగ్ చివరి దశలో ఉండటంతో.. మూవీ ప్రమోషన్స్ కు పదును పెడుతున్నారు టీమ్. ఇక ఈమూవీ గురించి తారక్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేవర సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఎదరు చూస్తూ ఉన్నారు. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు.. అటు కన్నడాలో కూడా భారీ ఎత్తున ఎన్టీఆర్ కు ఫ్యాన్స్ ఉన్నారు. దాంతో అక్కడ కూడా దేవర సినిమా గురించి కన్నడ నాట నుంచి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక తాజాగా రిలీజ్ చేసిన దేవర మూవీ గ్లింప్స్ కు(Glimpse) ప్రేక్షకుల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఈసినిమా గురించి వారు ఎంత ఎదురు చూస్తున్నారో. తెలుగు గ్లింప్స్ కు ఎంత వ్యూస్ వచ్చాయో.. దేవర కన్నడ వెర్షన్ గ్లింప్స్ కు కూడా పోటీ గా వ్యూస్ వచ్చాయి. అక్కడ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ గ్లింప్స్ కు 2.6 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇతర భాషల్లో సైతం దేవర గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చిందనే సంగతితి తెలిసిందే.

అయితే దేవర గ్లింప్స్ గురించి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి స్పందించారు కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్(kiccha Sudeep). ఆయనకు ఓ ప్రెస్ మీట్ లో దేవర గ్లింప్స్ గురించి ప్రశ్న ఎదురు కాగా.. వన్ వర్డ్ ఆన్సర్ తో అదరగొట్టేశారు. దేవర గ్లింప్స్ చూశానని ఎపిటోమ్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పుకొచ్చారు. కిచ్చా సుదీప్ దేవర గ్లింప్స్ గురించి పాజిటివ్ గా రియాక్ట్ కావడంతో ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతున్నారు. కన్నడనాట కూడా ..హీరోల రియాక్షన్ సినిమాకు ప్లాస్ అవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

Updated On 18 Jan 2024 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story