ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మూవీపై అక్కసు వెళ్ళగగ్గారు కన్నడ స్టార్ హీరో దర్శన్(Darshan). సలార్ అని పేరుచెప్పకుండానే..మన ఊరు మన సినిమా అంటూ..లోకల్ ఫీలింగ్ బయటకు తీశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?డిసెంబర్ 21న సలార్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయి. కెజియఫ్(KGF) సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Niel) తెరకెక్కించిన ఈసినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

ప్రభాస్(Prabhas) సలార్(Salaar) మూవీపై అక్కసు వెళ్ళగగ్గారు కన్నడ స్టార్ హీరో దర్శన్(Darshan). సలార్ అని పేరుచెప్పకుండానే..మన ఊరు మన సినిమా అంటూ..లోకల్ ఫీలింగ్ బయటకు తీశారు. ఇంతకీ ఆయన ఏమంటున్నారంటే..?డిసెంబర్ 21న సలార్ రిలీజ్ కు అన్ని సన్నాహాలు పూర్తి అయ్యాయి. కెజియఫ్(KGF) సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Niel) తెరకెక్కించిన ఈసినిమా ప్యాన్‌ ఇండియా రేంజ్ లో భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈసినిమాను కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయగా.. కేజీఎఫ్‌ చిత్రాలను నిర్మించిన నిర్మాతలే భారీ బడ్జెట్ తో సలార్‌ మూవీని నిర్మించారు. మరి ఈ విదషయంలో కొంత మంది కన్నడ హీరోలు కోపంగా ఉన్నట్టు తెలుస్తోంది. అది శాండల్ వుడ్ హీరో దర్శన్ నోటి నుంచి వచ్చిన మాటలను బట్టి తెలుస్తోంది.

సలార్ రిలీజ్ అయ్యే టైమ్ లోనే కన్నడ నుంచి మరో సినిమా రిలీజ్ అవుతోంది. సలార్ డిసెంబర్ 21న రిలీజ్ అవుతుంటే.. కన్నడ స్టార్ హీరో దర్శన్ హీరోగా తెరకెక్కిన కంటీర సినిమా డిసెంబర్ 29న రిలీజ్ అవుతోంది. ఈక్రమంలో టీమ్ అంతా ప్రమోషన్లలో(Promotions) బిజీ అయింది. తాజాగా, కంటీర మూవీ టీం విలేకరుల సమావేశంలో పాల్గొంది. ఈ సందర్భంగా దర్శన్‌కు సలార్‌, డంకీ(Dunki) మూవీల గురించి ఓ ప్రశ్న ఎదురైంది. కొన్ని రోజులు అటు ఇటుగా ఈ రెండు ప్యాన్‌ ఇండియా సినిమాలు కన్నడనాట విడుదల అవుతున్నాయి కదా.. మరి మీ సినిమా విషయంలో భయంగా లేదా?.. భారీ చిత్రాలు రిలీజ్ కు ఉన్ననేపథ్యంలో మీ సినిమా రిలీజ్ డేట్ ఏమైనా మార్చుకుంటారా అని అడిగారు. దాంతో దర్శన్ ఈ ప్రశ్నకు ఘాటుగా సమాధానంచెప్పారు.

మేం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇది మన సినిమా, మన ఊరు.. ఎవరికో భయపడి మనం ఎందుకు దూరంగా పారిపోవాలి. మన ఇంటికి రావాలంటే.. వాళ్లకు భయముండాలి. మనకు ఎందుకు భయం. అని ఇతర భాషల సినిమాలపై అక్సను వెల్లడించారు. అంతే కాదు తనకు కన్నడ నాటలో ఉ‍న్నానో.. లేదో అన్న భయం వేస్తోంది అని మరో మాట కూడా ఆయన అన్నారు. సినిమా బాగుంటే కన్నడ ప్రేక్షకులే ఆధరిస్తారు...కచెయ్యి పట్టుకుని ముందుకు తీసుకెళతారు. తన సినిమాను తప్పక కన్నడ ప్రజలు ఆదరిస్తారంటూ దర్శన్ అన్నారు. అంతు కాదు కంటీర ఒక అచ్చమైన కన్నడ సినిమా. కన్నడ ప్రజల కోసం చేసిన సినిమా.. అని అన్నారు దర్శన్. ప్రస్తుతం ఆయన మాటలు వైరల్ అవుతుండగా.. నెటిజన్ల నుంచి ఆయన విమర్షలు ఎదుర్కొంటున్నారు. సలార్ కూడా కన్నడ సినిమానే అవుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. సినిమా ఏ భాషకు చెందినది అయినా.. ముందు గౌరవించటం నేర్చుకోవాలని అంటున్నారు.

Updated On 16 Dec 2023 7:25 AM GMT
Ehatv

Ehatv

Next Story