మాకు హేమ లాంటి కమిటీ కావాలి!

మలయాళ సినిమా పరిశ్రమలో(Malyala Film industry) జస్టిస్‌ హేమా కమిటీని(Justicehema committee) ఏర్పాటు చేసినట్టుగానే కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనూ(Kannada film industry) ఓ కమిటీ ఉండాలని కర్నాటకకు చెందిన ఫిల్మ్‌ ఇండస్ట్రీ ఫర్‌ రైట్స్‌ అండ్‌ ఈక్విటి (ఫైర్‌) ప్రభుత్వానికి విన్నవించుకుంది. సుప్రీం కోర్టు(Supreme court) లేక హైకోర్టు(High court) రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేయాలని కోరింది. కన్నడ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై నివేదిక తీసుకు రావాలని ఫైర్‌ సభ్యులు కోరారు. ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు(siddharamaiah) తమ డిమాండ్లను తెలియచేస్తూ ఓ వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈ వినతి పత్రంలో 153 మంది సంతకం చేశారు. ఇందులో పలువురు నటీనటులు, రచయితలు ఉన్నారు. వీరిలో నటుడు కిచ్చా సుదీప్(Kiccha sudeep), నటీమణులు రమ్య, ఆషికా రంగనాథ్, శ్రద్ధా శ్రీనాథ్, ఫైర్‌ అధ్యక్షురాలు, దర్శకురాలు, రచయిత కవితా లంకేశ్‌ వంటివారు ఉన్నారు. కేఎఫ్‌ఐ (కన్నడ ఫిల్మ్‌ ఇండస్ట్రీ)లో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై సమగ్ర విచారణ జరపాలన్నది వీరి కోరిక. కర్ణాటక పరిశ్రమలో పని చేస్తున్న మహిళలకు సురక్షితమైన, సమానమైన పని వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి, వారిపై జరుగుతున్న లైంగిక దాడులను అరికట్టడానికి సమగ్రమైన చర్యలు చేపట్టాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో 2018లో ఫైర్‌ సంస్థ ఆరంభమైంది. దేశంలోనే మొట్టమొదట ఐసీసీ (పరిశ్రమలో జరుగుతున్న అంతర్గత ఫిర్యాదుల కమిటీ)ని స్థాపించడంలో ఫైర్‌దే కీలక పాత్ర.

Eha Tv

Eha Tv

Next Story