కన్నడ పాపులర్ యాక్టర్ నాగభూషణ(Nagabhushana) తన ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) కి ఒక మహిళ బలైపోయింది. లిమిట్ ను మించి స్పీడ్ గా కారు డ్రైవింగ్ చేయడం వల్ల ఓ మహిళ నిండు ప్రాణాలు బలికొన్నాడు నాగభూషణ. సెప్టెంబర్ 30 శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన యాక్సిండెంట్(Accident) వివరాల ప్రకారం..

Actor Nagabhushana Arrest
కన్నడ పాపులర్ యాక్టర్ నాగభూషణ(Nagabhushana) తన ర్యాష్ డ్రైవింగ్(Rash Driving) కి ఒక మహిళ బలైపోయింది. లిమిట్ ను మించి స్పీడ్ గా కారు డ్రైవింగ్ చేయడం వల్ల ఓ మహిళ నిండు ప్రాణాలు బలికొన్నాడు నాగభూషణ. సెప్టెంబర్ 30 శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన యాక్సిండెంట్(Accident) వివరాల ప్రకారం.. అతివేగంతో కారు నడుపుతూ వస్తున్న నాగభూషణ బెంగళూరులోని కోనకుంటె క్రాస్ సమీపంలో అదుపుతప్పి ఫుట్‌పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక జంట పైకి దూసుకు వెళ్ళాడు. దాంతో ఈ ప్రమాదంలో 48 ఏళ్ల మహిళ మృతి చెందింది. దీంతో నాగభూషణ ని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు వివరాలు ప్రకారం.. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో నాగభూషణ ఆర్‌ఆర్ నగర్ లో ఓ కార్యక్రమంలో పాల్గొని జేపీ నగర్‌లోని తన నివాసానికి తిరిగి కారులో వెళ్తున్నాడు. కారు అతివేగంతో ఉండడంతో కోననకుంటె క్రాస్ సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పక్కనే ఫుట్‌పాత్ పై నడుస్తున్న కృష్ణప్ప-ప్రేమ దంపతుల పైకి దూసుకెళ్లింది.
ఇక గాయపడిన దంపతులను.. స్వయంగా యాక్సిడెంట్ చేసిన నాగభూషణే దగ్గరుండి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే తీవ్ర గాయాలు అవ్వడం వల్ల మహిళ మార్గ మధ్యలోనే మరణించినట్టు తెలుస్తోంది. ఇక భర్త కృష్ణప్ప మాత్రంట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. ఓ ప్రైవేట్ హాప్పిటల్ లో అతనికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇక ఈ విషయంలో. బాధిత దంపతుల కుమారుడు నాగభూషణ పైకంప్లైయింట్ ఇచ్చాడు. రాత్రి భోజనం చేసి ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న తన తల్లిదండ్రులను నాగభూషణ కారు ఢీకొట్టిందని పేర్కొన్నాడు.
ఇక అటు నాగభూషణ వాదన వేరే విధంగా ఉంది. ఆయన ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో.. ఆ దంపతులు ఫుట్ ఫాత్ మీద నడుస్తూ.. అకస్మాత్తుగా ఫుట్‌పాత్ నుండి రోడ్డు మీదకు రావడంతోనే తన కారు అదుపు తప్పి.. ప్రమాదం జరిగిందని చెప్పుకొచ్చాడు. పోలీసులు అరెస్ట్ చేసిన నాగభూషణ శనివారం అర్థరాత్రి బెయిల్‌పై విడుదలయ్యాడు.
