‘బిగ్‌బాస్(Bigg Boss) రియాల్టీషో చరిత్రలో తొలిసారి ఒక కంటెస్టెంట్ హౌస్‌లో ఉండగానే అరెస్టయ్యారు. ఇండస్ట్రీని ఊపేసిన ఈ గటన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగింది.

‘బిగ్‌బాస్(Bigg Boss) రియాల్టీషో చరిత్రలో తొలిసారి ఒక కంటెస్టెంట్ హౌస్‌లో ఉండగానే అరెస్టయ్యారు. ఇండస్ట్రీని ఊపేసిన ఈ గటన కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో జరిగింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన వర్తుర్ సంతోష్(Vartur Santosh) అనే కంటెస్టెంట్ ను.. బిగ్ బాస్ హౌస్ లో ఉండగానే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈ విషయంలో నిర్వహకులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు కాప్స్.. అయితే ఇంతకీ ఆయన ఏం నేరంచేశారు. ఎందుకు ఇలా అరెస్ట్ చేసి తీసుకెళ్ళారు.. కారణం ఏంటి..?

సంతోష్ పులిగోరు(Tiger Nail) లాకెట్ ధరించి కన్నడ బిగ్‌బాస్‌ షో-10వ సీజన్‌లో పాల్గొన్న కారణంగా వర్తుర్ సంతోష్ ను అటవీశాఖ అధికారులు(Forest Officers) అరెస్ట్ చేశారు. పులిగోరు ధరించడం చట్టవిరుద్ధమని, అందుకే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని వెల్లడించారు. సంతోష్ పులిగోరు వేసుకన్నట్టు తమకు కంప్లైయింట్ అందిందన్నారు పోలీసులు. దాంతో అరెస్ట్ చేయక తప్పలేదన్నారు.

అయితే ఇక్కడ సంచలనంగా మారిన విషయం ఏంటీ అంటే.. బిగ్‌బాస్‌ హౌస్‌‌లోకి వెళ్లి మరీ సంతోష్‌ను అటవీశాఖ అధికారులు అరెస్ట్‌ చేయడం. ఈ విషయంపై ఇండస్ట్రీ అంతట పెద్ద చర్చ జరుగుతోంది. ముందుగా సంతోష్‌ని అప్పగించడానికి నిర్వాహకులు నిరాకరించారు. అయితే తమ విధులకు అడ్డుతగలొద్దని అటవీశాఖ అధికారులు హెచ్చరించడంతో వారు అనుమతిచ్చారు. సంతోష్ ధరించిన పులిగోరును స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించడంతోనే ఆయనను అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం ఆయన రామోహళ్లి ఫారెస్ట్ అధికారుల అదుపులో ఉన్నారని, విచారణ అనంతరం సంతోష్‌ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Updated On 24 Oct 2023 6:54 AM GMT
Ehatv

Ehatv

Next Story