కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర(Vijay Raghavendra) భార్య స్పంద‌న‌(Spandana) కన్నుమూశారు. స్పంద‌న‌ మరణ వార్త విని అందరూ షాక్ అయ్యారు. స్పందన గుండెపోటుతో(Heart Stroke) మరణించింది. స్పందన కుటుంబంతో కలిసి హాలీడే కోసం బ్యాంకాక్(Bankok) వెళ్లింది. అక్కడ ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమెకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి వచ్చింది.

కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర(Vijay Raghavendra) భార్య స్పంద‌న‌(Spandana) కన్నుమూశారు. స్పంద‌న‌ మరణ వార్త విని అందరూ షాక్ అయ్యారు. స్పందన గుండెపోటుతో(Heart Stroke) మరణించింది. స్పందన కుటుంబంతో కలిసి హాలీడే కోసం బ్యాంకాక్(Bankok) వెళ్లింది. అక్కడ ఆమెకు గుండెపోటు వచ్చింది. ఆమెకు ఒక్కసారిగా ఛాతీ నొప్పి వచ్చింది. ఆస్పత్రికి చేరుకునేలోపే మృతి చెందింది. లో బీపీ స‌మ‌స్య కార‌ణంగా ఆమెకు గుండెపోటు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.

ఆగస్టు 8న ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని బ్యాంకాక్ నుండి బెంగళూరుకు తీసుకురానున్నారు, ఆ తర్వాత ఆమె అంత్యక్రియలు జ‌రుగుతాయి. విజయ్, స్పందన 2007లో వివాహం చేసుకున్నారు. ఈ నెల‌లోనే ఈ జంట తమ 16వ వార్షికోత్సవాన్ని జ‌రుపుకోవాల్సివుంది. ఇంత‌లోనే చేదువార్త వినాల్సి వ‌చ్చింది.

కన్నడ చిత్రాలలో విజయ్ ని చిన్నారి ముత్ అని పిలుస్తారు. విజ‌య్‌ నిర్మాత ఎస్‌ఏ చిన్నెగౌడ కుమారుడు. చిన్నప్పటి నుంచి సినిమాల్లో ఉన్న‌ విజయ్‌కి జాతీయ అవార్డు కూడా వచ్చింది. 2013లో విజయ్ కన్నడ బిగ్ బాస్ విన్న‌ర్‌గా నిలిచాడు

Updated On 7 Aug 2023 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story