కన్నడ నటుడు ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ అరెస్ట్ అయ్యారు

కన్నడ నటుడు ‘ఛాలెంజింగ్ స్టార్’ దర్శన్ అరెస్ట్ అయ్యారు. మైసూరు పోలీసులు దర్శన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మైసూరులోని ఫామ్‌హౌస్‌లో దర్శన్‌ని అరెస్టు చేసినట్లు సమాచారం. చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ నిందితుడని తెలుస్తోంది. రేణుకాస్వామి హత్యకు సంబంధించి కన్నడ నటుడు దర్శన్‌ను ఈరోజు విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు కేసు నమోదు చేసిన రెండు రోజుల తర్వాత పోలీసులు తెలిపారు.

దర్శన్‌ను మైసూర్‌లోని అతని ఫామ్‌హౌస్ నుండి తీసుకువెళ్లారు. తదుపరి విచారణ కోసం బెంగళూరుకు తరలిస్తున్నారు. ఈ కేసులో ప్రమేయం ఉన్నందున అతనిని అరెస్టు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూన్ 8న రేణుకా స్వామి హత్య జరిగింది. జూన్ 9న కామాక్షిపాళ్యం సమీపంలోని డ్రైన్‌లో రేణుకా స్వామి మృతదేహం లభ్యమైంది. దర్శన్ భార్యకు రేణుకాస్వామి అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు పోలీసులు తెలిపారు. తొలుత ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానించారు. అయితే తదుపరి విచారణ అనంతరం అది హత్యగా తేలింది.

Updated On 11 Jun 2024 5:40 AM GMT
Yagnik

Yagnik

Next Story