కని కుస్రుతి(Kani Kusruti) .. మలయాళ నటి. ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) గ్రాండ్‌ ప్రీ అవార్డు దక్కించుకున్న ఆల్‌ వుడ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ సినిమాలో కని కుస్రుతి కీలకపాత్ర పోషించారు. పాయల్ కపాడియా(Payal Kapadia) తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను ఎందుకు ధరించారంటే పాలస్తీనా జాతీయ జెండాలో ఈ నాలుగు రంగులు ఉంటాయి. ఆమె పాలస్తీనాకు మద్దతుగా ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించారు.

కని కుస్రుతి(Kani Kusruti) .. మలయాళ నటి. ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో(Cannes Film Festival) గ్రాండ్‌ ప్రీ అవార్డు దక్కించుకున్న ఆల్‌ వుడ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ సినిమాలో కని కుస్రుతి కీలకపాత్ర పోషించారు. పాయల్ కపాడియా(Payal Kapadia) తెరకెక్కించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై సందడి చేసిన కని కస్రుతి పుచ్చకాయను పోలి ఉన్న హ్యాండ్‌బ్యాగ్‌ను ఎందుకు ధరించారంటే పాలస్తీనా జాతీయ జెండాలో ఈ నాలుగు రంగులు ఉంటాయి. ఆమె పాలస్తీనాకు మద్దతుగా ఆ హ్యాండ్‌బ్యాగ్‌ను ధరించారు. కని కుస్రుతి అద్భుతమైన నటి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె సినిమాల్లో నటించడం మొదలు పెట్టినప్పుడు అనేక ఆర్ధిక ఇబ్బందులను(Financial Crises) ఎదుర్కొన్నారు. సినిమాల్లోకి వచ్చిన తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఆర్ధికంగా స్వతంత్రంగా ఉన్నప్పుడే తాను ప్రశాంతంగా ఉండగలనని, జీవనోపాధి కోసమే సినిమాల్లో నటించాల్సి వచ్చిందని చెప్పారు. ఆమె ఇంకా ఏమన్నారంటే ' 2020లో నేను నటించిన మలయాళ చిత్రం "బిరియాని"కి కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్, మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నాను. కానీ అంతకుముందు నా జీవితమంతా కన్నీళ్లతో పోరాటమే. నా దగ్గర డబ్బు లేని సమయంలో సజిన్ నన్ను సంప్రదించాడు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఆయనతో ఒకే మాట చెప్పాను. ఇందులో నాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఈ క్యారెక్టర్‌ నేను చేయలేనని అన్నాను. మరొకరిని వెతకండి సలహా ఇచ్చాను. ఆ సమయంలో నాకు డబ్బు అవసరం ఉన్నప్పటికీ సినిమా చేయాలని అనిపించలేదు. మూడు నెలల తర్వాత చిత్ర నిర్మాత మళ్లీ నన్ను సంప్రదించారు' అని కని కుస్రుతి తెలిపారు. 'నాకు ఈ సినిమా చేయడానికి ఆసక్తి లేదు. కానీ నా దగ్గర డబ్బు లేదని చెప్పాను. నాకు దాదాపు 70 వేల రూపాయల ఆఫర్ ఇచ్చారు. అది నాకు చాలా పెద్ద మొత్తం. అప్పుడు నా అకౌంట్‌లో కేవలం మూడు వేల రూపాయలే ఉన్నాయి' అని చెప్పారు. ఒకవేళ తాను థియేటర్‌కే పరిమితమైన ఉండి ఉంటే, అక్కడ బాగా సంపాదించగలిగి ఉంటే సినిమాల్లోకి రాకపోయేదానిని అని తెలిపారు. 'భవిష్యత్తులో జీవనోపాధి పొందే పరిస్థితులు లేకుంటే నాకు ఇష్టం లేని పనులు చేయవలసి రావొచ్చు. అలాంటి వారు ఫీల్డ్‌లో చాలా మంది ఉన్నారు' అని కని కుస్రుతి చెప్పారు.

Updated On 28 May 2024 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story