కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మాస్ డైరెక్టర్ సిరుత్తై శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ సినిమాకు సంబంధించి హీరో సూర్య సెకండ్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇప్పటికే కంగువ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజవ్వగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. సూర్య పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Kollywood star hero Surya), మాస్ డైరెక్టర్ సిరుత్తై శివ (Mass Director Siruttai Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న కంగువ సినిమా(Kanguva movie)కు సంబంధించి హీరో సూర్య సెకండ్ లుక్ రిలీజ్(Hero Surya second look release) అయ్యింది. ఇప్పటికే కంగువ సినిమా నుంచి ఫస్ట్ లుక్, గ్లింప్స్ రిలీజవ్వగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ లుక్ రిలీజ్ చేశారు. సూర్య పవర్ ఫుల్ యోధుడిగా కనిపించనున్న ఈ చిత్రం 3డీ ఫార్మాట్‌లో కూడా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన తన పోర్షన్స్ పూర్తి చేశానని సూర్య సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. సంక్రాంతి సందర్భంగా తన సెకండ్ పోస్టర్ రిలీజ్ చేసి.. అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశాడు హీరో సూర్య. కంగువ సినిమా విషయంలో తనకు బాగా సహకరించిన చిత్ర యూనిట్ కు థాంక్స్ చెప్పాడు.

స్టూడియో గ్రీన్(Studio Green), యువీ క్రియేషన్స్ బ్యానర్స్ (UV Creations Banners) కలిసి భారీ బడ్జెట్‎తో నిర్మిస్తున్న ఈ సినిమా 2024 సమర్‎లో థియేటర్లలోకి రానుంది. దేశ వ్యాప్తంగా 10 భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో కంగువ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా(periodical action drama) ఉండబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ దిశా పటాని (Bollywood actress Disha Patani) హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్(Devishri Prasad) సంగీతం అందిస్తున్నాడు. ఇక..చాలా వైల్డ్ లుక్స్ తో భయపెడుతున్న హీరో సూర్య.. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‎లో రెండు పాత్రల్లో కనిపిస్తున్నాడు. భవిష్యత్తు, వర్తమానం పాత్రల్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పోస్టర్‎ని షేర్ చేసి.. డెస్టినీ అనేది టైం కంటే కూడా బలమైంది. భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఈ సినిమా ఉండబోతుందని తెలిపారు చిత్రయూనిట్. దీంతో సూర్య కంగువ కొత్త పోస్టర్ వైరల్ గా మారింది.

 
 
Updated On 16 Jan 2024 1:54 AM GMT
Ehatv

Ehatv

Next Story