బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranawat) మరో బాంబు పేల్చింది. తన ఫ్రెండ్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ను కరణ్ జోహార్(Karan Johar) మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలపెట్టి హాలీవుడ్‌కు చేరుకుందని కంగనా ఆరోపించింది.
బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranawat) మరో బాంబు పేల్చింది. తన ఫ్రెండ్ ప్రియాంక చోప్రా(Priyanka Chopra)ను కరణ్ జోహార్(Karan Johar) మానసికంగా వేధించాడని, అందుకే ఆమె బాలీవుడ్‌ను వదిలపెట్టి హాలీవుడ్‌కు చేరుకుందని కంగనా ఆరోపించింది. నటుడు షారుఖ్ ఖాన్(Sharukh Khan)తో ప్రియాంక సన్నిహితంగా ఉండటాన్ని కరణ్ జోహర్ తట్టుకోలేకపోయాడని, అందుకే ప్రియాంకను మానసికంగా వేధించాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. వరుస ట్వీట్ల ద్వారా కంగనా ఈ ఆరోపణలను చేసింది.
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఉన్న సమయంలోనే అకస్మాత్తుగా హాలీవుడ్‌కు వెళ్లిపోయింది ప్రియాంక చోప్రా. ఇటీవల ఓ అమెరికన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను బాలీవుడ్‌ను ఎందుకు వదిలిపెట్టాల్సి వచ్చిందో ప్రియాంక చెప్పుకున్నారు. హిందీ సినిమా పరిశ్రమలో రాజకీయాలు ఎక్కువని, వాటిని తట్టుకోవడం చాలా కష్టమని, ఆ కష్టాలను భరించలేకే తాను హాలీవుడ్‌కు వచ్చానని ప్రియాంక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బాలీవుడ్‌లో తాను ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నానని అన్నారు. ప్రియాంక చేసిన ఈ కామెంట్లు సోషల్ మిడియాలో వైరల్ అయ్యాయి. కంగన, వివేక్ అగ్నిహోత్రి వంటి సినిమా ప్రముఖులు ప్రియాంక చోప్రాకు బాసటగా నిలిచారు.
కంగనా రనౌత్ అయితే ప్రియాంకకు సపోర్ట్ చేస్తూనే కరణ్‌జోహర్‌పై విరుచుకుపడ్డారు. నిజానికి బాలీవుడ్ గురించి ప్రియాంక చెప్పింది తక్కువేనని, పరిశ్రమలోని కొందరు ఒక ముఠాగా ఏర్పడి ఆమెను తీవ్రంగా అవమానించారని కంగన తెలిపారు. తద్వారా ఆమె పరిశ్రమను వదిలిపెట్టేలా చేశారన్నారు. స్వయంకృషితో ఎంతో ఎదిగిన ప్రియాంకను ఇండియా వదిలిపెట్టి వెళ్లిపోయేలా చేశారని కంగన ట్వీట్‌లో పేర్కొన్నారు. షారుఖ్‌తో ప్రియాంక సఖ్యతగా ఉండటం కరణ్ జీర్ణించుకోలేకపోయారని, అది మనుసులో పెట్టుకుని ప్రియాంకను కరణ్ బ్యాన్ చేశారని కంగన ఆరోపించింది. అప్పట్లో మీడియాలో దీని గురించి కథలు కథలుగా వచ్చాయని చెప్పింది. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్‌లో ఎదిగిన వారిని చూసి మూవీ మాఫియా తట్టుకోలేదని, ప్రియాంకను ఆ విధంగానే వేధించారని కంగన వివరించింది. సినిమా పరిశ్రమ వాతావరణాన్ని, సంస్కృతిని చెడగొట్టినందుకు కరణ్ జోహార్ బాధ్యత వహించాలని కంగనా డిమాండ్ చేసింది. అమితాబ్‌బచ్చన్, షారుఖ్ వంటి వారు సినిమాల్లో అడుగుపెట్టినప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవని, ఇప్పుడే దారుణమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయని కంగన తెలిపారు.