ఏదో ఒక వివాదం లేకపోతే కంగనా రనౌత్‌కు(Kangana Ranuth) నిద్రపట్టదు కాబోలు. ఆమె గిచ్చి కయ్యం పెట్టుకునే రకం. అటు సినిమా వాళ్లను, ఇటు రాజకీయ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తుంటారు. తాజాగా కంగనా తమిళంలో టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి-2(chandramukhi) సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నది.
ఏదో ఒక వివాదం లేకపోతే కంగనా రనౌత్‌కు(Kangana Ranuth) నిద్రపట్టదు కాబోలు. ఆమె గిచ్చి కయ్యం పెట్టుకునే రకం. అటు సినిమా వాళ్లను, ఇటు రాజకీయ నాయకులను ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తుంటారు. తాజాగా కంగనా తమిళంలో టైటిల్ పాత్రను పోషించిన చంద్రముఖి-2(chandramukhi) సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఈ సినిమాలో రాఘవ లారెన్స్(Raghava Lawrence) హీరోగా నటిస్తున్నాడు. 20 ఏళ్ల కిందట వచ్చిన చంద్రముఖికి దర్శకత్వం వహించిన పి.వాసునే(P.Vasu) దీనికి డైరెక్టర్‌గా వ్యహరిస్తున్నారు. కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం చైన్నె లోని ఒక స్టార్ హోటల్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు.
ఇందులో పాల్గొన్న నటి కంగనా రనౌత్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తమిళంలో తాను నటించిన మూడో సినిమా చంద్రముఖి-2 అని చెప్పిన కంగనా ఇంతకు ముందు వచ్చిన చంద్రముఖి సినిమాను చూశానని అన్నారు. అందులో జ్యోతిక నటన తనకు బాగా నచ్చిందన్నారు. జ్యోతిక తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. అయితే ఆమెతో తనను పోల్చుకోవద్దని, తాను నటించిన పాత్రే అసలైన చంద్రముఖి అని కంగనా తెలిపారు. హారర్ర్, కామెడీ ఫ్యామిలీ అంటూ అన్ని అంశాలు కలిగిన చంద్రముఖి సినిమాలో నటించడం సంతోషంగా ఉందన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. రాజకీయాల్లో అవకాశం వస్తే వదులుకోనని, తాను దేశభక్తురాలినని, అందుకే తనవంతుగా పేదలకు తోచిన సాయం చేస్తున్నానని అన్నారు. రాజకీయాలలోకి వస్తే సినిమాలు వదులుకోవాలంటూ జనసేన(Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ను(Pawan kalyan) ఉద్దేశించి మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించినప్పుడు రోజా అంటే ఎవరు? ఆమె గురించి తనకేమీ తెలియదని, ఆమె గురించి తానేం మాట్లాడతానని కంగనా తెలిపారు.