విధు వినోద్ చోప్రా(Vidhu vinod Chopra) తీసిన 12th ఫెయిల్(12th fail) సినిమా అందరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీసు దగ్గర బాగానే వసూళ్లు సాధించింది. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం హాట్‌స్టార్‌లో(Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్ చోప్రాను చాలామంది నిరుత్సాహపరిచారు. పెట్టిన పెట్టుబడిలో పాతికశాతం కూడా వెనక్కిరాదని, ఓటీటీకి(OTT) ఇవ్వడమే బెటరని భయపెట్టారు కూడా! ఇలా భయపెట్టిన వారిలో విధు వినోద్ చోప్రా భార్య, సినీ క్రికెట్ అనుపమ చోప్పా(Anupama Chopra) కూడా ఉండటం విశేషం.

Kangana Ranaut
విధు వినోద్ చోప్రా(Vidhu vinod Chopra) తీసిన 12th ఫెయిల్(12th fail) సినిమా అందరినీ ఆకట్టుకుంది. బాక్సాఫీసు దగ్గర బాగానే వసూళ్లు సాధించింది. గత ఏడాది అక్టోబర్‌లో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం హాట్‌స్టార్‌లో(Hotstar) స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడు విధు వినోద్ చోప్రాను చాలామంది నిరుత్సాహపరిచారు. పెట్టిన పెట్టుబడిలో పాతికశాతం కూడా వెనక్కిరాదని, ఓటీటీకి(OTT) ఇవ్వడమే బెటరని భయపెట్టారు కూడా! ఇలా భయపెట్టిన వారిలో విధు వినోద్ చోప్రా భార్య, సినీ క్రికెట్ అనుపమ చోప్పా(Anupama Chopra) కూడా ఉండటం విశేషం. ఈ విషయాన్ని విధు వినోదే స్వయంగా చెప్పుకొచ్చారు. 'తన సినిమాపై చివరాఖరికి భార్య కూడా నమ్మకం పెట్టుకోలేదు. ఈ చిత్రం చూడటానికి ఎవరూ థియేటర్ రారని విమర్శించింది' అని విధు వినోద్ తెలిపారు. ప్రతీ విషయంలో తలదూర్చే కంగనా రనౌత్(Kangana Ranaut) ఈ వ్యవహారంపై కూడా రియాక్టయ్యింది. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అనుపమపై ఫైరయ్యింది. 'విధు వినోద్ చెప్రా సర్ భార్య అనుపమ చోప్రాకు తెలివైన అమ్మాయిలంటే ఈర్ష్య. వాళ్లంటనే ఈమెకు గిట్టదు. అలాంటి వ్యక్తి భర్తపై అసూయపడటంలో ఆశ్చర్యం లేదు. ఆయన సంపాదించిన పేరు, డబ్బుతో ఈమె సొంతంగా వెబ్‌సైట్ పెట్టింది. చిన్నచిన్నవ్యాపారాలు చేస్తూ ఉంటుంది. బాలీవుడ్ డైరెక్టర్ భార్యగా సినిమా పార్టీలకు, ఈవెంట్లకు వెళ్తుంటుంది. అక్కడ టాలెంట్‌ను, మంచి సినిమాలు తొక్కేయాలనుకునే గాసిప్ గ్యాంగ్‌తో జత కడుతుంది' అని విమర్శించింది. ఇది చూసిన నెటిజన్లు నీ అంత బోల్డ్‌గా సినీ పరిశ్రమలో ఎవరు లేరని మెచ్చుకుంటున్నారు. మరికొందరు మాత్రం 'ముందు నీ కెరీర్ క్లోజ్ కాకుండా చూసుకో.. ఈ గొడవలు పక్కన పెట్టి సినిమాల మీద ఫోకస్ చేస్తే మంచిది' అని కామెంట్టు చేస్తున్నారు.
