బాలీవుడ్ నటి కంగనా రనౌత్ త్వరలో 'ఎమర్జెన్సీ' సినిమాతో బిగ్ స్క్రీన్‌ను షేక్ చేయబోతోంది. అయితే మరో వార్తతో కంగనా ఓ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. తమిళ సూపర్‌స్టార్ ధనుష్ ‘డి50’ సినిమాలో నటించేందుకు కంగనా నిరాకరించిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉండగా.. ఓ కొత్త వార్త పూర్తిగా ఊహాగానాలకు ముగింపు పలికింది.

Kangana Ranaut Reacts To Reports Declined An Offer By Dhanush For His Next Project
బాలీవుడ్ నటి కంగనా రనౌత్(Kangana Ranaut) త్వరలో 'ఎమర్జెన్సీ' సినిమాతో బిగ్ స్క్రీన్(Big Screen)ను షేక్ చేయబోతోంది. అయితే మరో వార్తతో కంగనా ఓ హెడ్‌లైన్స్(Headlines)లో నిలిచింది. తమిళ సూపర్‌స్టార్ ధనుష్(Dhanush) ‘డి50’ సినిమాలో నటించేందుకు కంగనా నిరాకరించిందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉండగా.. కంగనా రనౌత్ స్వయంగా స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్(Instagram) లో ఓ వార్తా కథనం యొక్క స్క్రీన్‌షాట్(Screenshot)ను షేర్ చేసి.. 'ఫేక్ న్యూస్ అలర్ట్(Fake News Alert), అలాంటి సినిమా ఏది నాకు ఆఫర్ చేయలేదు' అని రాసింది. ధనుష్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, నేను అతనికి నో చెప్పలేను' అని కంగనా పేర్కొంది.
సన్ పిక్చర్స్(Sun Pictures) బ్యానర్‌పై ధనుష్ తన 50వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. దీనికి సంబంధించి.. ఇందులో ప్రధాన పాత్ర కోసం కంగనా రనౌత్‌ను సంప్రదించారని.. అయితే ఆమె నటించడానికి నిరాకరించిందని మీడియా కథనంలో పేర్కొంది. నెగెటివ్ రోల్(Negative Role) కోసం కంగనాను సంప్రదించగా.. ఆమె ఆఫర్‌ను తిరస్కరించిందని నివేదిక పేర్కొంది. అయితే ఈ నివేదికపై కంగనా స్పందించడంతో అన్ని ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ధనుష్ 50వ చిత్రం తన తొలి చిత్రం 'పుదుపేట్టై'(Pudhupettai)కి సీక్వెల్ అని ప్రచారం జరుగుతోంది. మురికివాడలో నివసించే ఓ విద్యార్థి భయంకరమైన గ్యాంగ్‌స్టర్‌గా మారిన కథ ఇది.
