Kangana Ranaut : రాజకీయాల్లోకి కంగనా రనౌత్..!
కంగనారనౌత్(Kangana Ranaut) ఫైనల్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుంది. రాజకీయాల్లోకి కంగనా రనౌత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ(Lok sabha) స్థానంపై పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. కొంత కాలం కిందట ఆమె ద్వారకాలోని శ్రీకృష్ణుడి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. రాజకీయాల్లోకి (Politics)వస్తున్నారా అని మీడియా ప్రశ్నిస్తే.. కృష్ణభగవానుడు ఆశీర్వదాలు ఉంటే తప్పక పోటీ చేస్తానని చెప్పింది.

kangana
కంగనారనౌత్(Kangana Ranaut) ఫైనల్‌గా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతుంది. రాజకీయాల్లోకి కంగనా రనౌత్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ క్లారిటీ ఇచ్చారు. లోక్‌సభ(Lok sabha) స్థానంపై పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. కొంత కాలం కిందట ఆమె ద్వారకాలోని శ్రీకృష్ణుడి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం.. రాజకీయాల్లోకి (Politics)వస్తున్నారా అని మీడియా ప్రశ్నిస్తే.. కృష్ణభగవానుడు ఆశీర్వదాలు ఉంటే తప్పక పోటీ చేస్తానని చెప్పింది. అయితే కంగనా రనౌత్ సొంత నియోజకవర్గం హిమాచల్‌ప్రదేశ్‌లో(Himachal Pradesh) ఉంది. ఆమె ఇక్కడి నుంచే పోటీ చేస్తుందా లేదా అని తెలియాల్సి ఉంది.
ఇక సినిమాల విషయానికొస్తే కంగా రనౌత్ హిందీ(Hindi), తమిళం, తెలుగు భాషల్లో సినిమాలు చేసింది. పాన్ ఇడియా(PAN INDIA) స్టార్‌గా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా కంగనా రనౌత్.. 'ఎమర్జెన్సీ'(Emergency) సినిమాలో ఇందిరాగాంధీ పాత్ర పోషిస్తుంది. రాజకీయాలు, ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూ చర్చల్లో ఉంటుంది. సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.
