బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) సంచలనాలకు మారుపేరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో ఉంటారు. సోషల్‌ మీడియాలో(Social media) కూడా యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇందిరా గాంధీ(Indra Gandhi) పరిపాలన, నాటి సంఘటనలతో రూపొందిస్తున్న ఎమర్జెన్సీ(Emergency) సినిమాలో లీడ్‌ రోల్‌ను పోషిస్తున్నారు కంగనా రనౌత్‌.

బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌(Kangana Ranaut) సంచలనాలకు మారుపేరు. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుని వార్తల్లో ఉంటారు. సోషల్‌ మీడియాలో(Social media) కూడా యాక్టివ్‌గా ఉంటూ వర్తమాన అంశాలపై స్పందిస్తుంటారు. ప్రస్తుతం ఇందిరా గాంధీ(Indra Gandhi) పరిపాలన, నాటి సంఘటనలతో రూపొందిస్తున్న ఎమర్జెన్సీ(Emergency) సినిమాలో లీడ్‌ రోల్‌ను పోషిస్తున్నారు కంగనా రనౌత్‌. ఎప్పుడు ఏదో ఒక వివాదస్పద వ్యాఖ్యలు చేసే కంగనా బీ టౌన్‌లో హాట్‌ టాపిక్‌గా నిలుస్తుంటారు. లేటెస్ట్‌గా ఆమెకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఆ వీడియో చూస్తే కంగనా రనౌత్‌ పెళ్లికి రెడీ అయినట్టు అనిపిస్తోంది. కారులో వచ్చిన కంగనాను మీడియా ప్రతినిధులంతా చుట్టుముట్టి ఆమె పెళ్లి గురించి ప్రశ్నలు వేశారు. దీంతో వెంటనే స్పందించిన కంగనా రనౌత్‌ వెడ్డింగ్ కార్డు చూపించారు. మీడియా ప్రతినిధులకు శుభవార్త చెప్పింది. మీరందరూ కూడా పెళ్లికి తప్పకుండా రావాలంటూ వారిని ఆహ్వానించారు కూడా. అయితే వివాహ ఆహ్వాన పత్రికలో ఆమె పేరు లేకపోవడంతో వారంతా షాక్‌ తిన్నారు. దీంతో కంగనా పెళ్లి చేసుకోబోతోందంటూ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

కంగారు పడకండి... ఇదంతా కంగనా నిర్మిస్తున్నా చిత్రం 'టిక్కు వెడ్స్ షేరు'(Tikku Weds Sheru) మూవీ ప్రమోషన్లలో భాగంగా చేశారు. తొలిసారిగా కంగనా ప్రొడక్షన్ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్(Manikarnika) బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కబీర్‌ శ్రీవాస్తవ(Sai Kabir Srivastav) దర్శకత్వం వహించారు. హీరో హీరోయిన్లుగా నవాజుద్దీన్ సిద్ధిఖీ(Nawazuddin Siddiqui), అవనీత్ కౌర్(Avneet Kaur) నటించారు. ఈ చిత్రం ట్రైలర్‌ ఇవాళ రిలీజ్‌ అవుతోంది. ఈ సందర్భంగా చేసిన ప్రమోషన్ వీడియోను కంగనా రనౌత్‌ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్స్ ఇంట్రెస్టింగ్‌ కామెంట్లు చేస్తున్నారు. అన్నట్టు ఈ సినిమాను నేరుగా ఓటీటీలోనే విడుదల చేయనున్నారు. అమెజాన్ ప్రైమ్(amazon Prime) వీడియోలో ఈ నెల 23నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Updated On 14 Jun 2023 3:00 AM GMT
Ehatv

Ehatv

Next Story