నింగి నుంచి కరెన్సీ నోట్లు(Currency) వచ్చిపడుతుంటే ఎంత సంబరంగా ఉంటుందో కదా! ఆ ఊహే గొప్పగా ఉంది కదూ! ఈ ఊహను నిజం చేశాడు చెక్‌ రిపబ్లిక్‌కు(Check Republic) చెందిన ఓ వ్యక్తి. ఆ దేశానికి చెందిన టీవీ వ్యాఖ్యత, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కామిల్‌ బర్తోషెక్‌(Kamil Bartoshek) ఈ పని చేశారు.

నింగి నుంచి కరెన్సీ నోట్లు(Currency) వచ్చిపడుతుంటే ఎంత సంబరంగా ఉంటుందో కదా! ఆ ఊహే గొప్పగా ఉంది కదూ! ఈ ఊహను నిజం చేశాడు చెక్‌ రిపబ్లిక్‌కు(Check Republic) చెందిన ఓ వ్యక్తి. ఆ దేశానికి చెందిన టీవీ వ్యాఖ్యత, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ కామిల్‌ బర్తోషెక్‌(Kamil Bartoshek) ఈ పని చేశారు. హెలికాఫ్టర్‌(Helicopter) నుంచి అక్షరాల లక్ష డాలర్‌ నోట్లను జారవిడిచారు. ఈయన వన్‌మాన్‌ షో: ది మూవీ(One Man Show The movie) అనే సినిమాలో నటించారు. ఆ సినిమాను ప్రమోట్‌ చేయాలి కదా! అందుకు ఆయన యూజర్ల కోసం ఓ కాంటెస్ట్‌ను నిర్వహించాడు.

కాంటెస్ట్‌లో పాల్గొనేవారు ముందుగా సినిమా చూడాలి. తర్వాత ఫజిల్‌ను(Puzzle) సాల్వ్‌ చేయాలి. అలా ఫజిల్‌ను పరిష్కరించిన మొదటి వ్యక్తికి లక్ష డాలర్లను బహుమతిగా ఇస్తానని చెప్పారు కామిల్‌ బర్తోషెక్‌. అందుకోసం యూజర్లు తమ పేర్లను ప్రత్యేక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కాంటెస్ట్‌లో చాలా మంది పాల్గొన్నారు కానీ ఒక్కరు కూడా ఫజిల్‌ను సాల్వ్‌ చేయలేకపోయారు. దాంతో బహుమతిగా ఇవ్వాలనుకున్న లక్ష డాలర్లను పేర్లను రిజిస్టర్‌ చేసుకున్నవారికి పంచిపెట్టాలనుకున్నారు.

వారికి సీక్రెట్‌ కోడ్‌తో ఓ మెయిల్‌ పంపించారు. అందులో హెలికాఫ్టర్‌ నుంచి నగదును జారవిడిచే ప్రాంతానికి సంబంధించిన క్లూ ఇచ్చారు. మెయిల్‌లో తెలిపినట్టుగానే కామెఇల్‌ బర్తోషెక్‌ ఆదివారం ఉదయం ఆరు గంటలకు నిబుర్క్‌ జిల్లా లైసా నాడ్‌లబెమ్‌(Lisa Nadlabem) అనే ప్రాంతంలోని ఖాళీ ప్రదేశంలో కరెన్సీ నోట్లను హెలికాఫ్టర్‌ నుంచి జారవిడిచాడు.

ఇందుకు సంబంధించిన వీడియోను ఫస్ట్‌ రియల్‌ మనీ రెయిన్‌(First real Money Rain) పేరుతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) షేర్‌ చేశాడు. డబ్బును ఉంచిన ఒక పెద్ద కంటెయినర్‌ను హెలికాఫ్టర్‌తో ఆకాశంలోకి తీసుకెళ్లి ముందుగా ప్రకటించిన ఖాళీ ప్రదేశంలో నగదును జార విడిచారు. అప్పటికే అక్కడ బ్యాగులు పట్టుకుని చాలా మంది వచ్చారు. కొందరైతే గొడుగులు కూడా తీసుకొచ్చారు. మొత్తం నాలుగు వేల మంది వచ్చారు. గంటలోపే నోట్లను మొత్తం సేకరించుకున్నారు.

Updated On 27 Oct 2023 3:42 AM GMT
Ehatv

Ehatv

Next Story