యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కేను(Project K) అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న ప్రాజెక్ట్ కేను(Project K) అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్(Vyjayanthi Movies) సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట్ వైరల్ అవుతోంది. ఈ భారీ ప్రాజెక్టులో అద్భుత నటుడు కమలహాసన్(Kamal Hassan) కూడా భాగం కాబోతున్నాడట! ఈ విషయాన్ని వైజయంతి మూవీస్ అధికారికంగా చెప్పలేదు కానీ సోషల్ మీడియాను మాత్రం ఈ వార్త షేక్ చేస్తోంది. సినిమాలో ఓ ప్రముఖ పాత్ర ఉందట. ఈ పాత్ర కోసం కమలహాసన్‌ను డైరెక్టర్ నాగ్ అశ్విన్ సంప్రదించారట. కమల్ వెంటనే ఓకే చెప్పలేదు కానీ స్టోరీ ఆయనకు బాగా నచ్చిందట.
కమల్ నుంచి సానుకూల సంకేతాలు వచ్చాయట. కమలహాసన్ తమకు కేవలం 20 రోజల కాల్‌షీట్లు ఇస్తే చాలునని, కమల్ నటించే సన్నివేశాలను చిత్రీకరించుకుంటామని నాగ్ అశ్విన్ చెప్పారట. సినిమాలో కమల్ పోషించేది ప్రతి నాయకుడి పాత్రేనని చాలా మంది నెటిజన్లు అనుకుంటున్నారు. అంటే ప్రభాస్‌ను ఎదుర్కొనే పాత్ర అన్నమాట. ప్రస్తుతం కమలహాసన్ బిజీగా ఉన్నారు. ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో పాలు పంచుకుంటున్నారు. సెప్టెంబర్ మాసం వరకు కమలహసన్ డేట్స్ లేవు. ఒకవేళ కమల్ ఓకే చెబితే సెప్టెంబర్ తర్వాతే కమలహాసన్ ప్రాజెక్టు కే సెట్‌లో అడుగుపెట్టగలరు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుంది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకోణె హీరోయిన్‌గా నటించబోతున్నారు.