కమలహాసన్‌(Kamal Hassan) నటిస్తున్న ఇండియన్‌ -2(Indian-2) సినిమా కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 27 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మోత మోగించింది. అనేక రికార్డులను సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. ఇండియన్‌ మొదటి భాగంలో కమలహాసన్‌ తండ్రి కొడుకులుగా నటించారు.

కమలహాసన్‌(Kamal Hassan) నటిస్తున్న ఇండియన్‌ -2(Indian-2) సినిమా కోసం సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 27 ఏళ్ల కిందట వచ్చిన ఇండియన్‌ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర మోత మోగించింది. అనేక రికార్డులను సృష్టించింది. అప్పట్లోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసింది. నిర్మాతలపై కాసుల వర్షం కురిపించింది. ఇండియన్‌ మొదటి భాగంలో కమలహాసన్‌ తండ్రి కొడుకులుగా నటించారు. ఓ మాజీ స్వతంత్ర సమరయోధుడు అవినీతిని రూపు మాపడానికి ఎలా పోరాటం సాగించాడు అన్న కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు. కమలహాసన్‌ నటనకు జనం నీరాజనాలు పట్టారు. దర్శకుడిగా శంకర్‌కు(shankar) ఎనలేని పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌ రాబోతున్నది. అయిదేళ్ల కిందట మొదలైన ఈ సినిమాకు ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అనేక అంతరాయాల తర్వాత లాస్టియర్‌ సెప్టెంబర్‌లో మళ్లీ షూటింగ్‌ మొదలయ్యింది. అప్పట్నుంచి నిరాటంకంగా షూటింగ్‌ జరుగుతోంది. ఇప్పుడు చివరి దశకు వచ్చింది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాకపోతే షూటింగ్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉండటంతో విడుదల వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ న్యూస్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.

ఈ సినిమా కోసం షూట్‌ చేసిన మొత్తం ఫుటేజ్‌ దాదాపు ఆరు గంటలపైనే ఉందట. ఇప్పుడు ఈ సినిమాను మూడు గంటలకు కుదించడం కష్టమే! ఎడిటర్‌కు కత్తిమీద సామే! అందుకే దీన్ని రెండు భాగాలుగా చేయాలనుకుంటున్నారు దర్శకుడు శంకర్‌. టైట్‌ స్క్రీన్‌ప్లేను సిద్ధం చేసి ఇండియన్‌-3కి హింట్‌ ఇస్తూ రెండో భాగాన్ని ఎడిట్‌ చేయనున్నారట. ఆరు గంటల ఫుటేజ్‌లో మూడు గంటలు ఇండియన్‌-2 కోసం అనుకున్నా.. మరో మూడు గంటల ఫుటేజ్‌ ఉంటుంది. ఇది మూడో భాగానికి పనికి వస్తుంది. వేస్ట్‌ ఫుటేజ్‌ అంతా తొలగించినా 75 శాతం సీన్లు రెడీగా ఉంటాయి. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మరో పాతికశాతం షూటింగ్‌ను పూర్తి చేసి రాబోయే రెండేళ్లలో సినిమాను రిలీజ్‌ చేయాలని శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారు. కాజల్‌(Kajal) ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నారు. సిద్ధార్థ్‌(siddarth) మరో ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతాన్ని ఎఆర్‌ రెహమాన్‌ అందిస్తున్నారు.

Updated On 27 July 2023 7:39 AM GMT
Ehatv

Ehatv

Next Story