కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు ఆగిపోతాయో తెలియదు.. ఎప్పుడు మొదలవుతాయో తెలియదు.. అసలు స్టార్ట్ అవుతాయో లేదో కూడా తెలియదు. అలాంటి సినిమానే ఒకటి కమల్ హాసన్(Kamal Hasan) మొదలు పెట్టి ఆపారు. అది ఇప్పటిదో.. ఈమధ్యదో కాదు..ఎప్పుడో 1997 లో స్టార్ట్ చేశారు.. అప్పుడు ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆపేవారు కమల్. ఇక ఇన్నాళ్ళకు .. అంటే దాదాపుగా 26 ఏళ్ల తరువాత మళ్లీ ఆ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారట లోకనాయకుడు. ఇంతకీ ఏంటా సినిమా..?

కమల్ హాసన్(Kamal Hasan) గురించి సౌత్ ఆడియన్స్(South Audiance) కు ప్రత్యేకంగా చెప్పాలా..? ఆయన ఎంత టాలెంటెడో అందరికి తెలిసిందే.. నటుడిగా, డాన్సర్ గా రచయితగా.. దర్శకుడిగా.. నిర్మాతగా.. రాజకీయ నాయకుడిగా.. ఇలా జీవితంలో ఎన్నో పాత్రలు పోషించిన ఆయన.. వెండితెరపై ఇంకెన్ని పాత్రలు పోషించి ఉంటారో లెక్కేలేదు. అటువంటి కమల్ హాసన్ 1997 లొ ఒక సినిమాను డైరెక్ట్ చేయాలి అని అనుకున్నాడు. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా 1997లో ఆ సినిమా స్టార్ట్ అయ్యింది. మరుదనాయగన్ అనే టైటిల్ తో కమల్ హీరోగా.. టైటిల్ పాత్ర పోషిస్తూ.. స్వీయ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందించే ప్రయత్నం జరిగింది. అంతే కాదు ఓపెనింగ్ కు గోప్ప గోప్ప నటులు కూడా వచ్చారు. కాని ఈసినిమా ఆతరువాత ఆగిపోయింది.

ఇంతకీ ఈ సినిమా ఎందుకు ఆగిపోయింది? మళ్లీ 26 సంవత్సరాల తర్వాత సెట్స్ పైకి ఎందుకు వెళ్లబోతోంది..? 1997లో ప్రారంభం అయిన ఈ సినిమా 40 శాతం షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే బడ్జెట్ సమస్యలతో పాటుగా మరికొన్ని కారణాలతో ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది. అయితే ఈ సినిమాను కమల్ హాసన్ వదిలేయ లేదు. గుర్తుకు వచ్చినప్పుడు.. ఎవరైనా అడిగినప్పుడల్లా.. ఈ సినిమాను తప్పకుండా పూర్తి చేస్తానని, ఇది తన కలల సినిమాగా కమల్ చెప్పుకొచ్చాడు. అంతే కాదు ఈసినిమాలో హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తారనిచెప్పాడు కమల్.

అయితే ఈ మూవీ 26 ఏళ్ళ తరువాత మళ్లీ మొదలు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసినిమాలో హీరోగా విక్రమ్ ను తీసుకోవాలి అని చూస్తున్నారట టీమ్. విక్రమ్ అయితే ఈ పోరాట సన్నీవేశాలు బాగా చేస్తాడు..విక్రమ్ మంచి ఛాయిస్ అనుకున్నాడట కమల్. అంతే కాదు ఈమూవీ 40 శాతం కమల్ తో తెరకెక్కింది. కాని ఆ సీన్స్ను ఇంకా వేరేవాటికి వాడబోతున్నారట. ఇక ఈమూవీ చేయడానికి ఒక రకంగా టాలీవుడ్ కారణం. టాలీవుడ్ లో బహుబలి, ఆర్ఆర్ఆఱ్ లాంటి సినిమాలు వచ్చిన తరువాతే.. కమల్ ఈసినిమాను కంప్లీట్ చేయాలని అనుకుననారట. మరి ఈమూవీ ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూడాలి.

Updated On 31 March 2023 11:55 PM GMT
Ehatv

Ehatv

Next Story