లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Hasaan) దూసుకెళ్తున్నాడు. విక్రమ్(Vikram) సినిమా హిట్ తరువాత ఆయన మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం శంకర్(Shankar) తో ఇండియన్ 2(Indian 2) మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) దూసుకెళ్తున్నాడు. విక్రమ్(Vikram) సినిమా హిట్ తరువాత ఆయన మంచి ఫామ్ లోకి వచ్చాడు. ప్రస్తుతం శంకర్(Shankar) తో ఇండియన్ 2(Indian 2) మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈమూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈసినిమా హిట్ అయితే.. విశ్వనటుడు కమల్ హాసన్ సక్సెస్ యాత్రకు అడ్డు కట్ట వేయడం ఎవరికీ సాధ్యం కాదు అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం కమల్ హాసన్ లెజెండరీ దర్శకుడు మణిరత్నంతో(Maniratnam) మళ్ళీ చాన్నేళ్లకి ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రం కమల్ కెరీర్ లో 234వ చిత్రం.

కాగా తాజాగా ఈ సినిమా నుంచి అప్డేట్ వచ్చేసింది. కమల్ ఫస్ట్‌ లుక్‌ ను(First look) మేకర్స్ రిలీజ్ చేశారు. టైటిల్(Title) అనౌన్స్‌మెంట్ వీడియోను ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేవారు. ప్రస్తుతం టైటిల్ పోస్టర్ వైరల్ అవుతోంది. సినిమాకు ఏఆర్ రెహమాన్(AR Rehman) మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రం సహ నిర్మాతలలో కమల్ కూడా ఒకరు. మొత్తానికి నవంబర్ 7న కమల్ హాసన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమా నుంచి క్రేజీ అప్ డేట్స్ రాబోతున్నాయి.

ఇక ఈ సినిమా కోసం ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ కూడా పని చేయబోతున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఇప్పటివరకు 9 జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ఆర్ఆర్ఆర్ ని ఎడిట్ చేసింది కూడా ఆయనే.రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ మరియు మద్రాస్ టాకీస్ బ్యానర్లపై కమల్ హాసన్, మణిరత్నం, ఆర్ మహేంద్రన్ మరియు శివ అనంతి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు. రెడ్ జెయింట్ ఫిల్మ్స్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ సమర్పిస్తున్నారు.

Updated On 6 Nov 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story