ఎన్నో ఇబ్బందులు.. మధ్య మధ్యలో వివాదాలు, లాంగ్ బ్రేక్ తరువాత స్టార్ట్ అయిన ఇండియన్ 2 మూవీ(India 2 Movie) షూటింగ్ శరవేంగంగా కొనసాగుతుంది. ఇక షూటింగ్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షనే తరువాయి అనుకున్నటైమ్ లో..షాక్ ఇచ్చాడు శంకర్(Shankar). వరుస షెడ్యూల్స్ ను చేస్తూనే ఉన్నారు ఇక షూటింగ్ చివరి దశకు రాగా..

ఎన్నో ఇబ్బందులు.. మధ్య మధ్యలో వివాదాలు, లాంగ్ బ్రేక్ తరువాత స్టార్ట్ అయిన ఇండియన్ 2 మూవీ(India 2 Movie) షూటింగ్ శరవేంగంగా కొనసాగుతుంది. ఇక షూటింగ్ అయిపోయింది. ఇక పోస్ట్ ప్రొడక్షనే తరువాయి అనుకున్నటైమ్ లో..షాక్ ఇచ్చాడు శంకర్(Shankar). వరుస షెడ్యూల్స్ ను చేస్తూనే ఉన్నారు ఇక షూటింగ్ చివరి దశకు రాగా.. లాస్ట్ షెడ్యూల్స్ ను ఆంధ్ర ప్రదేశ(Andhra Pradesh)లో ప్లాన్ చేశాడు స్టార్ డైరెక్టర్.

శంకర్ సౌత్ లో ఫస్ట్ పాన్ ఇండియా డైరెక్టర్. విజన్ ఉన్న దర్శకుడు. . విజువల్ తో ఆటాడేసుకుంటాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా ఇండియన్ 2 పరుగులు పెడుతోంది. ఈక్రమంలో ఈమూవీ షూటింగ్ షెడ్యూల్ ఆంధ్రాకు చేరింది. విజయవాడలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. రాజమండ్రిలో మరో షెడ్యూల్ పూర్తి చేసుకుని ప్రస్తుతం విశాఖపట్నానికి చేశారు. అయితే వైజాగ్ లో మాత్రం ఈమూవీ షూటింగ్ కు అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి.

భారతీయుడు-2 సినిమా షూటింగ్‌ ప్రస్తుతం విశాఖలో జరుగుతుంది. చినగదిలి నుంచి ముడసర్లోవ ప్రాంతం వరకు BRTS మార్గంలో భారతీయుడు-2 సినిమా షూటింగ్‌ జరుగుతుంది. నాలుగు లైన్ల BRTS రోడ్లలో మధ్యలోని రెండు లైన్లు సినిమా షూటింగ్‌కు తీసుకున్నారు. దీంతో హనుమంతవాక నుంచి సింహాచలం వెళ్లే వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడటంతో భారతీయుడు-2 షూటింగ్‌ కు కూడా ఇబ్బందులు కలిగాయి.

మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని శంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు, ఈ క్రమంలోనే ఈ సినిమాపైనే శంకర్ ప్రస్తుతం తన అత్యున్నత సమయాన్ని వెచ్చిస్తున్నారు. దీంతో శరవేగంగా కంప్లీట్ అవుతున్న ఈ భారీ చిత్రం ఎట్టకేలకు ఫైనల్ స్టేజ్ కి చేరుకుంటున్నట్టు తెలుస్తుంది. ‘భారతీయుడు 2’లో కాజల్ అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే రకుల్ ప్రీత్ సింగ్ కూడా మరో కీలక పాత్రలో నటిస్తోంది.

Updated On 22 Nov 2023 4:19 AM GMT
Ehatv

Ehatv

Next Story