లోకనాయకుడు కమల్ హాసన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కమల్ హాసన్ క్రేజ్ గురించి తెలిసిందే..? కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఎప్పుడో 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఈమూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఇండియన్ 2 (Indian 2) సెట్ లో అరుదైన సంఘటన జరిగింది. స్టార్ హీరో కమల్ హాసన్.. స్టార్ డైరెక్టర్ శంకర్ కు ఓ కాస్ట్లీ గిప్ట్ ను అందించారు. మరి ఆ గిప్ట్ కాస్ట్ ఎంత..? ఎందుకు ఇచ్చారు.

లోకనాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమిళంలో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కమల్ హాసన్ క్రేజ్ గురించి తెలిసిందే..? కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా.. ఎప్పుడో 27 ఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతోంది. ఈమూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ అందించింది కమల్ హాసన్ టీం. డైరెక్టర్ శంకర్ తో పాటు (Shankar) కమల్ బృందం ఇండియన్‌ 2 రషెస్‌ను చూశారు. ఈ రష్ చసిన తరువాత వారిలో మరింత కాన్పిడెంట్ వచ్చినట్టు తెలుస్తోంది. శంకర్‌ నుంచి మరో బ్లాక్ బస్టర్‌ ఖాయమని ధీమాగా ఉన్నాడు కమల్‌ హాసన్‌. అంతే కాదు ఇండియన్ 2 రషెస్‌ చూసి బాగా ఇంప్రెస్‌ అయిన కమల్ హాసన్‌ డైరెక్టర్‌ శంకర్‌కు వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు.

వాచ్ బహుమతిగా ఇవ్వడమే కాదు.. స్వయంగా ఆ వాచ్ ను శంకర్ కు పెట్టాడు కమల్. అయితే ప్రస్తుతం.. ఈ వాచ్‌ రేటు గురించి సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఈ వాచ్ మార్కెట్ ధర 8.77 లక్షలు వరకూ ఉంటుందని తెలుస్తోంది. కమల్‌హాసన్ ఖరీదైన panerai వాచ్‌ను శంకర్‌ చేతికి పెడుతున్న స్టిల్‌ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.

పాన్ ఇండియా స్టోరీతో వస్తున్న ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య (SJ Suriyah) విలన్‌గా నటిస్తుండగా..బాబీ సింహా, సిద్దార్థ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్రియా భ‌వానీ శంక‌ర్‌, స‌ముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్‌ 2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్ పై ఉద‌య‌నిధి స్టాలిన్‌-సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు.

ఇక పాన్ ఇండియా కథతో రాబోతున్న ఈసినిమాకు.. తమిళ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఇండియన్ 2 ఫస్ట్‌ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. శంకర్‌ టీం ఇండియన్ 2 చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను చెన్నై , లాస్‌ ఏంజెల్స్‌, తైవాన్‌, సౌతాఫ్రికా ప్రాంతాల్లో షూట్ చేశారు. ఫైనల్ గా సాంగ్స్ షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది.

Updated On 28 Jun 2023 8:31 AM GMT
Ehatv

Ehatv

Next Story