లోకనాయకుడు కమలహాసన్‌(Kamal Haasan), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఇద్దరూ ఇద్దరే! మేటి దిగ్గజాలు. తమిళ సినిమాను శాసిస్తున్న సీనియర్‌ నటులు. ఇద్దరూ ఆప్తమిత్రులు. వజ్రంలాగే నిజమైన స్నేహం కూడా చిరకాలం నిలిచే ఉంటుందనడానికి కమల్‌, రజనీలే బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. ఇద్దరూ కలిసి డజన్‌కు పైగా సినిమాల్లో నటించారు.

లోకనాయకుడు కమలహాసన్‌(Kamal Haasan), సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth) ఇద్దరూ ఇద్దరే! మేటి దిగ్గజాలు. తమిళ సినిమాను శాసిస్తున్న సీనియర్‌ నటులు. ఇద్దరూ ఆప్తమిత్రులు. వజ్రంలాగే నిజమైన స్నేహం కూడా చిరకాలం నిలిచే ఉంటుందనడానికి కమల్‌, రజనీలే బెస్ట్‌ ఎగ్జాంపుల్‌. ఇద్దరూ కలిసి డజన్‌కు పైగా సినిమాల్లో నటించారు. తర్వాత ఇద్దరూ కలిసి ఓ నిర్ణయానికి వచ్చి చెరో దారిని ఎంచుకున్నారు. హీరోలుగా ఎదిగారు. అగ్రస్థానానికి చేరుకున్నారు. కెరీర్‌ పరంగా ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉండింది. కాకపోతే ఎప్పుడూ వీరిద్దరి మద్య విభేదాలు రాలేదు. మిత్రభేదాన్ని వీరిద్దరూ కలలో కూడా ఊహించరు. ఇటీవల జరిగిన సైమా అవార్డుల వేడుకలో తమిళ సినిమాలకు సంబంధించి ఉత్తమ నటుడు అవార్డు కమలహాసన్‌కు లభించింది.విక్రమ్‌ సినిమాలో కమల్‌ నటనకుగానూ ఈ అవార్డు దక్కింది. అంతేకాదు, ఉత్తమ గాయకుడి అవార్డు కూడా కమల్‌నే వరించింది. అవార్డు అందుకుంటున్నప్పుడు తన చిరకాల మిత్రుడు రజనీకంత్‌ గురించి మాట్లాడారు కమలహాసన్‌. ఆయన ఏమన్నారంటే ‘మాలాంటి స్నేహితులు ఈ తరంలో లేరు. మాకు ఇగోలు ఉండవు. ఎవరికి సక్సెస్‌ వచ్చినా ఇద్దరం ఆనందిస్తాం. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌(Lokesh Kanagaraj) నా వీరాభిమాని. అతను రజనీని డైరెక్ట్‌ చేయనున్నట్టు ఇటీవల ప్రకటించాడు. మీ అభిమాని రజనీతో సినిమా చేయటమేమిటని కొందరు నాతో అన్నారు. సాధారణ ప్రేక్షకులకు రజనీ, కమల్‌ అంటే పోటీ హీరోలు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే.. రజనీ, కమల్‌ ప్రాణస్నేహితులు. పదిహేనేళ్ల క్రితం కమల్‌ 50 అనే కార్యక్రమంలో నా మిత్రుడు రజనీకాంత్‌ గురించి మాట్లాడాను. ఇప్పుడు మళ్లీ మాట్లాడాలనిపిస్తుంది. మా మధ్య విపరీతమైన పోటీ ఉండేది. కానీ అది ఆరోగ్యకరంగానే ఉండేది. ఓ విధంగా మేం ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం ఆ పోటీనే’ అని చెప్పుకొచ్చారు కమలహాసన్‌.

Updated On 18 Sep 2023 4:46 AM GMT
Ehatv

Ehatv

Next Story