ఈమధ్య హీరోలు ఏదో ప్లేయిన్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడటంలేదు. ఏదో ఒక కొత్తదనం చూపించాయి.. ఏదో ఒక ప్రయోగం చేయాలి. ఆడియన్స్(Audience) కళ్లలో డిఫరెంట్ గా కనిపించాలి అని తపిస్తున్నారు. ఇప్పటికే సెటిల్ అయిన స్టార్ హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీలో నిలబడాలి అనుకునే హీరోల వరకూ.. అందరూ ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రయోగాలు చేస్తున్నారు కూడా.
ఈమధ్య హీరోలు ఏదో ప్లేయిన్ గా సినిమాలు చేయడానికి ఇష్టపడటంలేదు. ఏదో ఒక కొత్తదనం చూపించాయి.. ఏదో ఒక ప్రయోగం చేయాలి. ఆడియన్స్(Audience) కళ్లలో డిఫరెంట్ గా కనిపించాలి అని తపిస్తున్నారు. ఇప్పటికే సెటిల్ అయిన స్టార్ హీరోల దగ్గర నుంచి ఇండస్ట్రీలో నిలబడాలి అనుకునే హీరోల వరకూ.. అందరూ ఇదే ఆలోచనలో ఉన్నారు. ప్రయోగాలు చేస్తున్నారు కూడా. ఈక్రమంలో నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Nandhamuri Kalyan Ram) కూడా తన సినిమా విషయంలో ఇలాంటి రికార్డ్ నే సాధించారు.
కళ్యాణ్ రామ్‌ను ప్రస్తుతం డెవిల్(Devil) సినిమా చేస్తున్నాడు. ఈసినిమాలో ఆయన గూఢచారిగా కనిపించబోతున్నారు. ఇలాంటి పాత్రను ఆయన చేయటం ఇదే మొదటిసారి కావటంతో దర్శక నిర్మాత అభిషేక్ నామా, కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ , కళ్యాణ్ రామ్ లుక్‌ను సినిమా ఆసాంతం సరికొత్తగా ఉండేలా డిజైన్ చేశారు. ఈసినిమాలో కళ్యాణ్ రామ్ దాదాపు 90 కాస్ట్యూమ్స్(Costumes) ను మార్చారట. ఈసినిమాకో ఆయన చాలా కష్టపడుతున్నారు.
దీని గురించి కాస్ట్యూమ్ డిజైనర్ రాజేష్ మాట్లాడుతూ అభిషేక్ నామాగారు డెవిల్ స్క్రిప్ట్ నాకు వివరించగానే హీరోగారి లుక్ డిఫరెంట్‌గా ఉండాలని అర్థమైంది. ఇందులో హీరో భారతీయుడు, అయినప్పటికీ బ్రిటీష్ గూఢచారిగా పని చేస్తుంటారు. ఆయన పాత్ర ను ఎలివేట్ చేసేలా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయాలనుకున్నాను. డెవిల్‌లో కళ్యాణ్ రామ్‌ను గమనిస్తే ఆయన ధోతి కట్టుకుని ఉంటారు. పైన ఒక వెయిస్ట్ కోటుని ధరించి ఉంటారు. ఆయన కాస్ట్యూమ్స్‌లో భారతీయత కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నాం అన్నారు.