నందమూరి కల్యాణ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న డెవిల్(Devil) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో కీలకమైన ప్రధానపాత్రను మాళవికా నాయర్(Malvika Nair) పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె పాత్ర పేరు మణిమేకల. ఆమె పవరఫుల్ రాజకీయ నాయకురాలు(Politician).

KalyanRam Devil
నందమూరి కల్యాణ్(Kalyan Ram) హీరోగా నటిస్తున్న డెవిల్(Devil) సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో కీలకమైన ప్రధానపాత్రను మాళవికా నాయర్(Malvika Nair) పోషిస్తున్నారు. ఆదివారం మాళవిక లుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో ఆమె పాత్ర పేరు మణిమేకల. ఆమె పవరఫుల్ రాజకీయ నాయకురాలు(Politician). ఆమె ప్రసంగాలు ప్రజలను చైతన్యవంతం చేస్తాయి. మరి అలాంటి రాజకీయ నాయకురాలికి, బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌కు(British Secret Agent) ఉన్న సంబంధం ఏమిటిన్నది సినిమాలోనే చూడాలి. అన్నట్టు డివిల్ సినిమాకు ట్యాగ్‌లైన్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. అంటే ఈసినిమాలో కల్యాణ్ రామ్ ఓ రహస్యాన్ని ఛేదించే బ్రిటిష్ సీక్రెట్ ఏంజెట్‌గా నటిస్తున్నారన్నమాట! ఇక ఈ సినిమాలో కథానాయికగా సంయుక్తా మీనన్(Samyuktha Menon) నటిస్తున్నారు. వచ్చే నెల 24వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషలలో డెవిల్‌ను విడుదల చేస్తున్నారు. అభిషేక్ నామా రూపొందిస్తున్న ఈ సినిమాకు హర్షవర్దన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
