ప్రస్తుతం డెవిల్(Devil) మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Rram). వెరైటీ సినిమాలు. మంచిమంచి కథలను సెలక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరో.. తాజాగా తన సినిమాకు సబంధించి అద్భుతమైన అప్ డేట్ ను స్వయంగా ఇచ్చారు ఇంతకీ కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే..?

రొటీన్ కు భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. తనకు బ్రేక్ ఇచ్చిన బింబిసార(Bimbisara) మూవీ సీక్వెల్(Movie sequel) తో రాబోతున్నాడు. వరుస ఫెయిల్యూర్స్ తరువాత కళ్యాణ్ రామ్ చాలా ఇబ్బందిపడ్డాడు. అయితే అదేటైమ్ లో కళ్యాణ్ రామ్ కు బింబిసార సినిమాతో హిట్ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ట(Vasista). ఈ యంగ్ హీరో దర్శకత్వంలో వచ్చిన బింబిసార మూవీ కళ్యాణ్ రామ్ కు బాగా కలిసి వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర తలెత్తుకుని నిలబడింది. ఇక ఈసినిమా హిట్ తో మెగాస్టార్ పిలిచి మరీ దర్శకుడికి అవకాశం ఇచ్చాడు.

ఇంట్రెస్టింగ్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమా ఆడియన్స్ కు బాగా నచ్చింది. కళ్యాన్ రామ్ కెరీర్ లో నే మంచి హిట్ గా నిలిచింది. ఇక ఈమూవీకి సీక్వెల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కాని అది ప్రపోజల్ స్టేజ్ లోనే ఉంది. అయితే ఈ సినిమా విషయంలో తాజాగ క్లారిటీ ఇచ్చాడు కళ్యాణ్ రామ్.

బింబిసార సినిమాపై ఎప్పటి నుంచో వార్తలు వైరల్ అవుతుండగా.. ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికిముహూర్తం కూడా ఫిక్స్ చేశాడు హీరో. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నట్టుగా కళ్యాణ్ రామ్ తెలిపాడు. దీనితో ఈ అవైటెడ్ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి అప్డేట్ నే అందించాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం తాను నటించిన డెవిల్ సినిమా ఈ డిసెంబర్ 29 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

Updated On 14 Dec 2023 7:41 AM GMT
Ehatv

Ehatv

Next Story