మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(srija).. రెండో సారి ఇష్టపడి కల్యాణ్ దేవ్ (Kalyan Dhev) ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తరువాత కళ్యాణ్ దేవ్ ని మెగా కుటుంబం చాలా గారంగా చూసింది. బిజినెస్ మెన్ గా ఉన్న కళ్యాణ్ దేవ్ ను... మెగాస్టార్ హీరోను చేశాడు.
మెగాస్టార్ మాజీ చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్(Kalyan Dev) తాజా పోస్ట్ భారీ చర్చకు దారితీసింది. అంతే కాదు వారు ఇంతవరకూ బయట పెట్టని విడాకుల మ్యాటర్ ను కూడా ఈ పోస్ట్ ద్వారా హింట్ ఇచ్చాడు కళ్యాణ్. ఇంతకీ ఆతను ఏమంటున్నాడు.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిన్న కూతురు శ్రీజ(srija).. రెండో సారి ఇష్టపడి కల్యాణ్ దేవ్ (Kalyan Dhev) ని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్ళైన తరువాత కళ్యాణ్ దేవ్ ని మెగా కుటుంబం చాలా గారంగా చూసింది. బిజినెస్ మెన్ గా ఉన్న కళ్యాణ్ దేవ్ ను... మెగాస్టార్ హీరోను చేశాడు. తనంటూ స్పెషల్ గుర్తింపు వచ్చేలా చేశారు. కాని గత కొంత కాలంగా కళ్యాణ్ ను దూరం పెడుతూ వచ్చారు మెగా ఫ్యామిలీ. మెగా కుటుంబంలో కళ్యాణ్ కలిపించడం లేదు.
వీరిద్దరూ విడాకులు(Divorce) తీసుకున్నట్లు తెలుస్తుంది. అధికారికంగా ప్రకటించనప్పటికీ ఇటీవల కళ్యాణ్ దేవ్ చేసిన ఒక పోస్ట్ తో వీరిద్దరూ చట్టపరంగా విడిపోయారని అర్ధమవుతుంది.ఇటీవల కళ్యాణ్ దేవ్ తన కూతరు నవిష్కతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. వారంలో నేను ఎంతో ఆనందంగా గడిపేది ఈ నాలుగు గంటలే అంటూ రాసుకొచ్చాడు. సాధారణంగా పిల్లలు ఉన్న భార్యాభర్తలు విడాకులు తీసుకోని విడిపోతే.. న్యాయస్థానం పిల్లల బాధ్యతను ఎవరికి అప్పగించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పిల్లలు తల్లి దగ్గర ఉంటే.. తండ్రి ఆ పిల్లల్ని వారంలో ఇన్ని గంటలు కలిసే అవకాశం కలిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కల్యాణ్ తన కూతుర్ని కలుస్తునట్లు తెలుస్తుంది.
తాజాగా కళ్యాణ్ తన సోషల్ మీడియాలో కూతురు గురించి మరో పోస్ట్ వేశాడు. తన తల్లి జ్యోతి పుట్టినరోజు కావడంతో కొన్ని బర్త్ డే కేక్ కటింగ్ ఫోటోలు షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే మామ్. నాకు తెలుసు నీకు నిజమైన వేడుక అంటే అందరం కలిసి ఉండడం. మిస్ యూ బేబీ నవిష్క అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఇటీవల మెగా కపుల్ నిహారిక అండ్ చైతన్య వారి విడాకులను అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.