సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్(amitabh bachchan), స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే(deepika Padukone) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

Postpone Of Kalki Movie Release
పాన్ ఇండియా హీరో యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న కల్కి 2898 AD సినిమాపైనే ప్రస్తుతం అందరి దృష్టి ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్(Ashwin datt) నిర్మిస్తున్న ఈ సినిమాకు నాగ్ అశ్విన్(Nag Ashwin) దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కమలహాసన్(Kamal Hassan) విలన్ పాత్ర పోషిస్తున్నారని అంటున్నారు. ఇక బాలీవుడ్
సూపర్‌స్టార్ అమితాబ్‌బచ్చన్(amitabh bachchan), స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే(deepika Padukone) ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే విడుదలైంది. హాలీవుడ్ రేంజ్‌లో స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంది అంటూ పలువురు ప్రశంసిస్తున్నారు. లేటెస్ట్‌గా కల్కి సినిమాకు సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేస్తామని మూవీ మేకర్స్ చాలా సార్లు ప్రకటించారు. అయితే ఈ రోజున కల్కి విడుదల కావడం కష్టమేనని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం మూవీ అభిమానులు, ప్రత్యేకించి ప్రభాస్ ఫ్యాన్స్ మరికొంత కాలం ఎదురుచూడక తప్పదు. 2024 మే 9వ తేదీన సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట! చిత్ర నిర్మాత అశ్వినీదత్ స్వయంగా సినిమా విడుదల తేదీని మార్చారని అంటున్నారు. అయితే సినిమా విడుదల తేదీలో మార్పు గురించి ఇప్పటి వరకు అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. వస్తే కానీ ఇందులో నిజమెంతో తెలియదు. కాకపోతే
కల్కి 2898 AD విడుదల తేదీని మార్చడానికి ప్రధాన కారణం VFX పనులే అని అంటున్నారు. సైన్స్ ఫిక్షన్ సినిమా కాబట్టి ఎక్కువగా గ్రాఫిక్స్ నిర్మాణ పనులు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. ఇందులో ఎక్కువగా భారీ సీన్లన్ని VFX మీదే అధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే సినిమా విడుదల తేదీని పొడిగించారని సమాచారం.
