బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా(Meena) తర్వాతకాలంలో హీరోయిన్‌గా మారారు. అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో ఆడిపాడిన మీనాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే మీనా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను(Vidhya Sagar) పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక(Nainika) అనే కూతురు జన్మించింది.
బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మీనా(Meena) తర్వాతకాలంలో హీరోయిన్‌గా మారారు. అగ్రహీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. స్టార్ హీరోలతో ఆడిపాడిన మీనాకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే మీనా 2009లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్‌ను(Vidhya Sagar) పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు నైనిక(Nainika) అనే కూతురు జన్మించింది. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తిపరమైన జీవితంలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా సాగిపోతున్న తరుణంలో మీనాకు అనుకోని కష్టం వచ్చింది. గత ఏడాది జూన్‌లో ఆమె భర్త విద్యాసాగర్ చనిపోయారు. మీనా ఒక్కసారిగా కుంగిపోయారు. నెమ్మదిగా ఆ బాధ నుంచి బయటపడ్డారు. ఇప్పుడిప్పుడే మళ్లీ ఆమె బిజీ అయ్యారు. ఇలాంటి సమయంలో మీనా రెండో పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. కాకాపోతే అవి వదంతులుగానే మిగిలిపోయాయి. లేటెస్ట్‌గా ఈ అంశంపై మీనా ఫ్రెండ్ కాలా మాస్టర్(Kala Master) స్పందించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మీనా పర్సనల్ లైఫ్ గురించి చెప్పారు. 'నాకు మీనాతోనే కాదు, ఆమె కుటుంబంతో కూడా మంచి అనుబంధం ఉంది. మేము ఫ్రెండ్స్‌గా కంటే కూడా అక్కాచెల్లెళ్లుగానే ఎక్కువ కలిసిపోయాం. తనకు ఏ అవసరం వచ్చినా వెంటనే నేను అక్కడికి వెళ్లిపోతాను. విద్యాసాగర్ అనారోగ్యంగా ఉన్నప్పుడు మూడు నెలల పాటు నేను మీనా దగ్గరే ఉన్నాను. అయితే మీనా జీవితంలో పెను విషాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత తను ఎప్పుడైనా ఉన్నట్లుండి ఫోన్ చేసినా కూడా భయమేసేది. ఆ మూడు నెలలు ముళ్ల మీదే ఉన్నట్లనిపించింది. మీనా భర్త మరణించాక ఆమెను సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా సమయం పట్టింది. జీవితం ఇంకా చాలా ఉంది, ఆ బాధ నుంచి బయటకు రావాలని ఏవేవో చెప్పేదాన్ని. తను కూడా నేను చెప్పేది కరెక్టేనని తలూపుతూనే ఈ విషాదం నుంచి బయటకు రావడం ఎంత కష్టంగా ఉందో మాటల్లో చెప్పలేనని బాధపడేది.
తర్వాత నెమ్మదిగా తను ఒప్పుకున్న సినిమాల కోసం సెట్స్‌కు రావడం మొదలుపెట్టింది. అప్పుడు తనతోపాటు నేను కూడా తిరిగి మామూలు మనుషులమయ్యాం. మీనా తల్లి గురించి తలుచుకుంటేనే బాధేసేది. మీనాది మరీ అంత పెద్ద వయసు కాదు కాబట్టి మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పాను. కానీ వాళ్లు నాతో గొడవపడేవారు. ముందు నీ పని నువ్వు చూసుకో లేదంటే సైలెంట్‌గా ఉండు అని నా నోరు మూయించేవాళ్లు. తనకు కూతురు ఉందని, అంతకుమించి ఎటువంటి రిలేషన్స్ కోరుకోవడం లేదని మీనా నాతో అంది' అని చెప్పుకొచ్చింది ఆమె స్నేహితురాలు.