సిల్క్‌ స్మిత(Silk Smitha) మరణం ఇప్పటికీ మిస్టరీనే! గ్లామర్‌ క్వీన్‌(Glamour Queen)గా పేరు సంపాదించుకున్న సిల్క్‌ స్మితలో ఓ అద్భుతమైన నటి ఉంది. శృంగారపాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌(Special Songs)కే పరిమితమవ్వలేదు. తనకు దొరికిన ప్రతీపాత్రలోనూ జీవించారు. అప్పుడప్పుడు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందలాది సినిమాలు చేశారు. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించారు. 1996 సెప్టెంబర్ 23న ఆమె కన్నుమూశారు. ఆమె మరణం ఓ మిస్టరీ! ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరైనా హత్య చేశారో తెలియదు.

సిల్క్‌ స్మిత(Silk Smitha) మరణం ఇప్పటికీ మిస్టరీనే! గ్లామర్‌ క్వీన్‌(Glamour Queen)గా పేరు సంపాదించుకున్న సిల్క్‌ స్మిత ఓ అద్భుతమైన నటి ఉంది. శృంగారపాత్రలు, స్పెషల్‌ సాంగ్స్‌(Special Songs)కే పరిమితమవ్వలేదు. తనకు దొరికిన ప్రతీపాత్రలోనూ జీవించారు. అప్పుడప్పుడు ప్రేక్షకులతో కంటతడి పెట్టించారు. తెలుగు,తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో వందలాది సినిమాలు చేశారు. అర్ధాంతరంగా తన జీవితాన్ని ముగించారు. 1996 సెప్టెంబర్ 23న ఆమె కన్నుమూశారు. ఆమె మరణం ఓ మిస్టరీ! ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరైనా హత్య చేశారో తెలియదు.

సిల్క్‌ స్మిత మరణంపై సీనియర్‌ నటి కాకినాడ శ్యామల తన అభిప్రాయాన్ని చెప్పారు. నటిగా, నిర్మాతగా, ఫైనాన్షియర్‌గా గుర్తింపు తెచ్చుకున్న కాకినాడ శ్యామల లేటెస్ట్‌గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. సిల్క్‌ స్మిత గురించి కూడా కొన్ని విషయాలు తెలిపారు. తాను చాలా సినిమాలకు ఫైనాన్స్‌ చేశానని, సిల్క్‌ స్మిత సొంత సినిమాకు కూడా డబ్బులిచ్చానని శ్యామల తెలిపారు. ఆ సినిమా ఆశించిన మేర విజయవంతం కాకపోవడంతో స్మిత అప్పుల పాలయ్యారని అన్నారు. 'ఆ ఒక్క సినిమాతో సిల్క్‌ స్మిత జీవితం తలకిందులయ్యింది. ఆస్తులన్నీ పొగొట్టుకుంది. సిల్క్‌ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆమె నిజాయితీ ఉన్న మనిషి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరంటుంటారు. ఆమెను హత్య చేశారని ఇంకొందరు అంటుంటారు. ఏం జరిగిందనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలియాలి. కానీ ఆమె ఎందుకు చనిపోయిందో ఎవరికీ తెలియదు. అంత కష్టంలోనూ సిల్క్‌స్మిత అందరికీ అప్పులు తిరిగి చెల్లించింది. ఆ తర్వాత ఆమె కెరీర్‌ బాగానే సాగింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నా' అని కాకినాడ శ్యామల చెప్పుకొచ్చారు.

Updated On 11 April 2023 2:07 AM GMT
Ehatv

Ehatv

Next Story