బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) కు ఏమయ్యింది. అసలు విషయం చెప్పకుండా ఆమె పెట్టిన పోస్ట్ అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది.
ఇంతకీ కాజోల్ ఏమని పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) కు ఏమయ్యింది. అసలు విషయం చెప్పకుండా ఆమె పెట్టిన పోస్ట్ అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది.
ఇంతకీ కాజోల్ ఏమని పోస్ట్ పెట్టింది.
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ సోషల్ మీడియాలో డిఫరెంట్ గా పోస్ట్ పెట్టింది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
తాజాగా కాజోల్ చేసిన పని అందరిని ఆశ్చర్య పరుస్తోంది. ఆమె తన ఇన్‌స్టాలో(Instagram) ఉన్న పోస్ట్ లు అన్ని డిలీట్ చేసేసింది. ఆ తరువాత ఒక కొత్త పోస్ట్ షేర్ చేసింది. లైఫ్‌లో కఠిన పరిస్థితులు ఎదురుకుంటున్నా అనే క్యాప్షన్ ఉన్న ఫోటోని షేర్ చేసిన కాజోల్ ఆ ఫోటో కింద.. సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోతున్నట్లు కామెంట్ రాసుకొచ్చింది.
దాంతో అంతా షాక్ అవుతున్నారు. కాజోల్ సడన్ గా ఈ డెసిషన్ ఎందుకు తీసుకుని ఉంటారు..? దానికి ట్రోల్స్ కారణమా? అని నెటిజన్ల మధ్య చర్చ జరుగుతోంది. ఈ విధంగా కొందరు ఆలోచిస్తుంటే, మరి కొంతమంది మాత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఇలా చేసి ఉంటుంది అని అంటున్నారు. కాజోల్ ప్రస్తుతం ది గుడ్ వైఫ్ (The Good Wife) అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే, ఫనా వంటి సూపర్ హిట్ లవ్ సినిమాల్లో నటించి అప్పిటిలో కురాళ్ళకి డ్రీం గర్ల్ అయ్యిపోయింది కాజోల్.
ప్రస్తుతం సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్, పలు వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ లో నటిస్తూ వస్తుంది. కాగా కాజోల్ సోషల్ మీడియాలో సూపర్ యాక్టీవ్ గా ఉంటుంది. తన కూతురు నైసా దేవగన్ (Nysa Devgan) తో కలిసి హాట్ హాట్ ఫోటోషూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ లో సందడి చేస్తుంటుంది. అయితే ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజెన్స్ మాత్రం కాజోల్ ని ట్రోల్ చేస్తూ వచ్చేవారు.అయితే ఆమె ఈ నిర్ణయం అమెరికన్ టీవీ సిరీస్ కి ఇది అడాప్షన్ గా తెరకెక్కుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగానే కాజోల్ అలా చేసి ఉండవచ్చని అంటున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సిరీస్ ప్రసారం కానుంది