సీనియర్‌ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌.. వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ ఆమెను తెలియకుండానే వివాదాల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఆమె మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశ రాజకీయ నాయకుల గురించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలువురు రాజకీయ నేతలు(Political leaders) కాజోల్‌ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంతకీ ఆమె ఏమన్నది.

ఈమధ్య కాంట్రవర్సీ కామెంట్స్ కు కెరాఫ్ అడ్రస్ గా తయారవుతోంది.. బాలీవుడ్ హీరోయిన్ కాజోల్(Kajol). ఈమధ్య ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివాదాస్పదం అవుతున్నాయి.

సీనియర్‌ బాలీవుడ్ హీరోయిన్ కాజోల్‌.. వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. ఆమె కాంట్రవర్సీ కామెంట్స్ ఆమెను తెలియకుండానే వివాదాల్లోకి నెట్టేస్తున్నాయి. తాజాగా ఆమె మరోమారు వివాదంలో చిక్కుకున్నారు. దేశ రాజకీయ నాయకుల గురించి ఆమె చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. కొంత కాలం క్రితం ఓ ఇంటర్వ్యూల్లో ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పలువురు రాజకీయ నేతలు(Political leaders) కాజోల్‌ మాటలపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇంతకీ ఆమె ఏమన్నది.

దేశ రాజకీయ నాయకుల్లో చదువురాని(Illiterate) వారే ఎక్కువ మంది ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించిన కాజోల్... దానికి సబంధించిన ప్రమోషన్స్ లో ఈ వ్యాఖ్యలు చేసింది. ఓ మీడియా సంస్థ తో మాట్లాడిన కాజోలు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

అంతే కాదు రాజకీయ నాయకులతో పాటు.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌ఖాన్‌(shah Rukh Khan) సినిమాపై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది సీనియర్ బ్యూటీ. ఆయన నటించిన పఠాన్‌(Pathan) సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి బాలీవుడ్ కు ఉపిరిపోయగా.. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అన్న ప్రచారం జరిగింది. ఈ కలెక్షన్స్‌ గురించి కాజోల్‌ సరదాగా చేసిన తాజా వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.కోర్ట్‌రూమ్‌ డ్రామా వెబ్‌ సిరీస్‌ ‘ది ట్రయల్‌’(The Trail) ఇటీవలే డిస్నీ హట్‌స్టార్‌ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో షారుఖ్‌ఖాన్‌తో తన అనుబంధం గురించి మాట్లాడింది కాజోల్‌.

షారుఖ్ తనకు గొప్ప స్నేహితుడని చెప్పిన కాజోల్... ఒకవేళ షారుఖ్‌ఖాన్‌ మీకు ఎదురైతే ఆయన్ని మీరు ఏం అడుగుతారని యాంకర్ ప్రశ్నించగా…పఠాన్‌ సినిమాకు వచ్చిన నిజమైన కలెక్షన్స్‌ ఎంతో చెప్పమంటాను అంటూ సరదాగా సమాధానమిచ్చింది. అయితే కాజోల్‌ వ్యాఖ్యల తో షారుఖ్‌ ఖాన్‌ అభిమానులు ఆగ్రహం వ్యాక్తం చేస్తున్నారు.

Updated On 17 July 2023 2:42 AM GMT
Ehatv

Ehatv

Next Story