బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) సంచలన వ్యాఖ్యలు చేసింది. అజయ్ దేవగణ్(Ajay Devgan) పరిచయమై ప్రేమలో పడిన టైమ్ లో తాను వేరొకరితో డేటింగ్(Dating) లో ఉన్నానంటోంది కాజల్. ఇంతకీ అసలు విషయం ఏంటీ..?
బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్(Kajol) సంచలన వ్యాఖ్యలు చేసింది. అజయ్ దేవగణ్(Ajay Devgan) పరిచయమై ప్రేమలో పడిన టైమ్ లో తాను వేరొకరితో డేటింగ్(Dating) లో ఉన్నానంటోంది కాజల్. ఇంతకీ అసలు విషయం ఏంటీ..?
బాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో కాజోల్- అజయ్ దేవగణ్ల(Kajol-Ajay Devgan) జంట కూడా ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు.. దాదాపు 24 ఏళ్లుగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటూ వస్తున్నారు. వీరి ప్రేమ, పెళ్ళికి గుర్తుగా.. వీరిద్దరికీ ఒక అమ్మాయి. ఒక అబ్బాయి ఉన్నారు. అజయ్ దేవగణ్ వరుస సినిమాలు చేస్తుండగా.. కాజోల్ మాత్రం అప్పుడప్పుడు అలా కనిపిస్తూ.. మురిపిస్తూ వస్తోంది. ఈక్రమంలో కాజోలో రీసెంట్ గా సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ ప్రేమ పెళ్లిగురించి మాట్లాడిన కాజోల్.. ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించింది.
తాజాగా హ్యూమన్స్ ఆఫ్ బాంబే(Humans Of Bombay) పోస్ట్ కాడ్ లో కాజోల్ మాట్లాడింది. ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయాన్ని వెల్లడించింది. తన భర్త అజయ్ దేవగణ్ తొలిసారి తనను కలిసే సమయంలో తాను మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని తెలిపింది. ఆ సమయంలో అజయ్ కూడా మరో వ్యక్తితో డేటింగ్ లో ఉన్నాడ నుకుంటానని చెప్పింది. ఆతరువాత అనుకోని విధంగా ఇద్దరు తమ పాత లవర్స్ తో.. బ్రేక్ చెప్పారని.. అన్నారు.
ఇక తాము ఇద్దరము తమ తొలి సినిమా సెట్స్ లో.. ఎక్కువ సేపు గడపడం వల్ల ఇద్దరి మధ్య చనువు ఏర్పడిందని కాజోల్ చెప్పింది. ఇద్దరం మంచి ఫ్రెండ్ అయ్యామని అన్నారు కాజల్ సరిగ్గా అదే టైమ్ లో తాను అప్పటి వరకూ డేటింగ్ చేస్తున్న వ్యక్తితో బ్రేకప్ అయ్యానని, అదే విధంగా అజయ్ కూడా బ్రేకప్ అయ్యాడని తెలిపింది. ఆ తర్వాత ఇద్దరం ఇంకా క్లోజ్ అవ్వడంతో ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందన్నారు కాజోల్. దాంతో తమ మధ్య స్నేహం ప్రేమగా మారిందన్నారు కాజోల్.
ఇక ఈ కార్యక్రమంలో ఆమెకు మరో ప్రశ్న ఎదురయ్యింది. మీకు సరైన వ్యక్తి అజయేనా అనే ప్రశ్న ఎదురవ్వగా.. ఆమె సమాధానం ఇస్తూ..... ఆ విషయం అజయ్ చెప్పాలని సరదాగా వ్యాఖ్యానించింది. హల్ చల్ సినిమాలో కాజోల్, అజయ్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1999లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి 2003లో కూతురు, 2010లో కొడుకు పుట్టారు. వీరిద్దరూ కలిసి కొన్ని సినిమాల్లో సందడి చేశారు.