క్ష్మీ కళ్యాణంతో(Lakshmi Kalyanam) తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన చందమామతో(chandamama) పాపులరయ్యారు. టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్నారు. అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించారు. 2008లో వచ్చిన పళని చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు.

Kajal Aggarwal To Quit Movies
లక్ష్మీ కళ్యాణంతో(Lakshmi Kalyanam) తెలుగు సినీ పరిశ్రమకు పరిచమైన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్‌లో వచ్చిన చందమామతో(chandamama) పాపులరయ్యారు. టాలీవుడ్ చందమామగా పేరు తెచ్చుకున్నారు. అచిరకాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించారు. 2008లో వచ్చిన పళని చిత్రంతో తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టారు. విజయ్, అజిత్(ajith), కార్తీ(Karthi) వంటి స్టార్ హీరోలతో జతకట్టారు. స్టార్ హీరోయిన్‌గా చాలా బిజీగా ఉన్న సమయంలోనే గౌతమ్ కిచ్లూ(Gautham Kichlu) అనే వ్యక్తిని ప్రేమించి మూడేళ్ల కిందట పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కాజల్ నటనకు గుడ్‌బై చెబుతారని అనుకున్నారంతా! అనుకున్నట్టుగానే కాజల్ కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నారు.
2021లో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు కాజల్.. తల్లి అయిన రెండు మూడు నెలలకే మళ్లీ నటించడం మొదలు పెట్టారు. పెళ్లి కాకముందు అంగీకరించిన ఇండియన్ -2(Indian -2) సినిమాలో కమల్‌హాసన్(Kamal Hassan) జంటకు నటించడం మొదలు పెట్టారు. ఆ చిత్ర షూటింగ్ అప్పుడే వర్కట్స్ చేసి మెరుపుతీగలా మారారు. ఇండియన్-2 సినిమా షూటింగ్ ఆల్మోస్టాల్ ఆఖరి దశకు చేరింది. తెలుగులో బాలకృష్ణ(Balakrishna) సరసన భగవంత్ కేసరి(bagavanth Kesari) అనే సినిమాలో నటిస్తున్నారు.
ఇదంతా ఓకేనే కానీ లేటెస్ట్‌గా కాజల్ గురించిన ఓ షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే కాజల్ అగర్వాల్ నటనకు గుడ్‌బై చెప్పబోతున్నారని! కాజల్ రెండోసారి గర్భం దాల్చారని(Pregnancy), ఈ కారణం చేత ఆమె కెమెరా ముందుకు రారన్న వార్తలు తెగ వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియదు. ఆమె వివరణ ఇస్తే కానీ నిజానిజాలు తెలియవు. ఇక కాజల్ ఈ మధ్యన తన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కన్నుల పండుగ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న కాజల్ నటనకు గుడ్‌బై చెప్పడమా? నో వే అని ఫ్యాన్స్ అంటున్నారు.
