చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే కాజల్ అగర్వాల్(Kajal Aggarwal )కాస్త డిఫరెంట్! నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటారామె! తొలుత బాలీవుడ్‌కు పరిచయమయ్యి, తర్వాత టాలీవుడ్‌కు వచ్చి, అటు పిమ్మట కోలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ అన్ని భాషల్లోనూ టాప్ స్టార్‌గా నిలిచారు. ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు.

Kajal Aggarwal
చాలా మంది హీరోయిన్లతో పోలిస్తే కాజల్ అగర్వాల్(Kajal Aggarwal )కాస్త డిఫరెంట్! నటనకు స్కోప్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటారామె! తొలుత బాలీవుడ్‌కు పరిచయమయ్యి, తర్వాత టాలీవుడ్‌కు వచ్చి, అటు పిమ్మట కోలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్ అన్ని భాషల్లోనూ టాప్ స్టార్‌గా నిలిచారు. ఈ మూడు భాషల్లోనూ నటిగా తనకంటూ ఓ స్థానాన్ని, గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళం భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్‌డమ్‌ను తెచ్చుకున్నారు. అగ్రనటిగా రాణిస్తున్న టైమ్‌లోనే చడీ చప్పుడు లేకుండా తను ప్రేమించిన వ్యక్తి గౌతమ్ కిచ్లును(Goutham kichlu) పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి కూడా! ప్రస్తుతం శంకర్(Shankar) దర్శకత్వంలో కమలహాసన్‌తో(Kamal hassan) కలిసి ఇండియన్– 2(Indian 2) చిత్రంలో నటిస్తున్నారు కాజల్. తెలుగులో బాలకృష్ణ(Bala krishna) సరసన నటించే అవకాశాన్ని దక్కించుకున్నారు. మొన్నామధ్య కాజల్ అగర్వాల్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆ విమర్శలకు ఆమె ఇప్పుడు సమాధానం ఇచ్చారు. తాను కడుపుతో ఉన్నప్పుడు చాలా లావు అయ్యానంటూ కొందరు విమర్శించానని వాటిని తాను అస్సలు పట్టించుకోలేదని అన్నారు. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత కొద్ది రోజులకే నటించడానికి సిద్ధం కావడంపై కూడా కొందరు చెత్త వాగుడు వాగారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును ఉన్నతంగా తీర్చిదిద్ది గొప్ప తల్లిగా నిలిచి ఇలాంటి వారికి తగిన సమాధానం చెప్పాలని నిర్ణయించుకున్నానని కాజల్ అగర్వాల్ తన మనసులో మాట చెప్పారు.
