తమ అభిమాన తారల పుట్టిన రోజు వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్(Fans) వారం ముందు నుంచే తెగ హడావుడి చేస్తుంటారు.
తమ అభిమాన తారల పుట్టిన రోజు వస్తున్నదంటే చాలు ఫ్యాన్స్(Fans) వారం ముందు నుంచే తెగ హడావుడి చేస్తుంటారు. పాలాభిషేకాలు, రక్తాభిషేకాలు చేస్తుంటారు. బోల్డంత డబ్బును ఖర్చు పెట్టుకుని వేడుకలు జరుపుతారు. ఇటీవల కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) 39వ పుట్టిన రోజును జరుపుకున్నారు. కాజల్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆమెకు మర్చిపోలేని కానుకను ఇచ్చారు. ఇంతకీ వారు ఏం చేశారంటే 150 మందికి కడుపునిండా భోజనం(Food )పెట్టారు. ఈ నెల చివరి వరకు 50 మొక్కలను(Plants) నాటుతామని ప్రతినబూనారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసి కాజల్ అగర్వాల్ ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ వేదికగా వారికి ఓ సందేశం పంపించారు. 'సమాజం పట్ల మీ ఆలోచన, దయ నన్ను ఆశ్చర్యపరుస్తున్నది. నాపై మీరు చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను' అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు కాజల్.