✕
Kajal Aggarwal controversial Statement : బాలీవుడ్లో ఆ పరిస్థితి ఉందంటూ.. కాజల్ కాంట్రవర్సీ కమెంట్స్.. !
By EhatvPublished on 31 March 2023 6:34 AM GMT
కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ పేరు చెప్పగానే మా.. కాజల్.. మా కాజల్ అంటూ కొట్టుకు చస్తారు.. అంత అభిమానం మరి ఆవిడంటే. తేజ డైరెక్ట్ చేసి ‘లక్ష్మీ కల్యాణం’ (lakshmi kalyanam) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇక ఆ తర్వాత ‘చందమామ’ (Chandamama ) సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే టాలీవుడ్లో కొంతకాలం ఒక వెలుగు వెలిగిన నటి ఆమె.

x
Kajal Aggarwal
-
- కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ఈ పేరు చెప్పగానే మా.. కాజల్.. మా కాజల్ అంటూ కొట్టుకు చస్తారు.. అంత అభిమానం మరి ఆవిడంటే. తేజ డైరెక్ట్ చేసి ‘లక్ష్మీ కల్యాణం’ (lakshmi kalyanam) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఇక ఆ తర్వాత ‘చందమామ’ (Chandamama ) సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే టాలీవుడ్లో కొంతకాలం ఒక వెలుగు వెలిగిన నటి ఆమె.
-
- అవన్నీ పక్కన పెడితే కాజల్ (Kajal) తాజాగా ‘రైజింగ్ ఇండియా’ అనే కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కొన్ని కాంట్రవర్సీ కమెంట్స్ చేసింది. సౌత్ మూవీస్ వర్సెస్ బాలీవుడ్ మూవీస్ అనే అంశంపై మాట్లాడుతూ.. బాలీవుడ్ (Bollywood)లో డిసిప్లైన్, నైతిక విలువలు తక్కువ.. పుట్టి పెరిగింది ముంబైలోనే అయినా నా సినీ జీవితం హైదరాబాద్ (Hyderabad)లో ప్రారంభమైందని.. మాతృభాష హిందీ (Hindi) అయినప్పటికీ తెలుగు, తమిళ సినిమాలో ఎక్కువగా నటించానంది.
-
- సౌత్ ఇండస్ట్రీలో ఓ మంచి వాతావరణం ఉంటుందని.. టాలెంట్ ఉంటే ఎవరినైనా ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పుకొచ్చింది. సౌత్‌లో గొప్ప టెక్నిషియన్లు, డైరెక్టర్లు ఉన్నారని.. హిందీలో కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ సౌత్‌లో ఉన్న ప్రొఫెషనలిజం, నైతిక విలువలు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండవని వివాదాస్పదంగా మాట్లాడింది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal).
-
- అయితే కాజల్ మాట్లాడిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె పెళ్లి తర్వాత ఓ ఐదు చిత్రాల్లో నటిస్తోంది. తమిళ్ చిత్రాలు క్వీన్ రీమేక్, కరుంగాపీఎం, పారిస్.. పారిస్‌తోపాటు ఉమా అనే ఓ బాలీవుడ్ చిత్రంలోనూ నటిస్తోంది. రీసెంట్గా రిలీజైన ‘ఘోస్టీ’ (Ghosty) చిత్రం బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టింది.
-
- అదలా ఉంటే కాజల్ (Kajal) ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘ఇండియన్-2’లో చేస్తోంది. శంకర్ (Shankar) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా కొద్దికాలం షూటింగ్ జరుపుకుని మధ్యలో గ్లిచెస్ రావడంతో పూర్తవకుండా బ్రేక్ పడింది. ఈ మూవీ సెట్లో ప్రమాదం జరగడం.. అటు నటుడు వివేక్ చనిపోవడం.. ఇలా రకరకాల కారణాలతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది.. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు అయింది పరిస్థితి.
-
- ఇక ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) సరసన నటించి.. కొన్ని రోజులు షూట్ జరిగాక ఈ మూవీ నుంచి ఆమె క్యారెక్టర్ ను తీసేశారు దర్శకనిర్మాతలు. ఆమె క్యారెక్టర్ సరిగ్గా సెట్ అవ్వలేదని ఆమెను తీసేసినట్టు ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) వివరణ ఇచ్చుకున్నారు అప్పట్లో.. ఇక కాజల్ విషయానికి వస్తే.. కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) ప్రస్తుతం తన భర్త గౌతమ్‌తో కలిసి వ్యాపారం చేస్తున్నారు.

Ehatv
Next Story