'లక్ష్మీ కల్యాణం'(Lakshmi Kalyanam) అనే తెలుగు సినిమాతో కాజల్ హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ 'మగధీర'(Maghadhira) సినిమా కాజల్(Kajal Aggarwal) లైఫ్‌నే మార్చేసింది. ఈ సినిమాతో ఈమెక్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దీంతో టాలీవుడ్‌లో అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆ మధ్యన పెళ్లి, పిల్లోడు అంటూ కాస్త గ్యాప్ ఇచ్చినప్పటకీ ఇప్పుడు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది.
'లక్ష్మీ కల్యాణం'(Lakshmi Kalyanam) అనే తెలుగు సినిమాతో కాజల్ హీరోయిన్‌గా పరిచయమైంది. కానీ 'మగధీర'(Maghadhira) సినిమా కాజల్(Kajal Aggarwal) లైఫ్‌నే మార్చేసింది. ఈ సినిమాతో ఈమెక్ స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చింది. దీంతో టాలీవుడ్‌లో అనేక అవకాశాలను అందిపుచ్చుకుంది. ఆ మధ్యన పెళ్లి, పిల్లోడు అంటూ కాస్త గ్యాప్ ఇచ్చినప్పటకీ ఇప్పుడు జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తోంది. డెలివరీ అయిన రెండు నెలలకే షూటింగ్ కు హాజరైందీ అందాల తార. ఈ చందమామా గత పుష్కరకాలంగా సినిమాలు చేస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో ఇండియన్ 2(Indian 2) లాంటి భారీ ప్రాజెక్టు ఉంది. శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సీక్వెల్‌లో కమల్ హాసన్(Kamal Haasan), సిద్ధార్థ్(Siddharth), రకుల్ ప్రీత్ సింగ్(Rakulpreeth singh) నటిస్తున్నారు.
అయితే 2020లో ముంబైకి చెందిన పారిశ్రామికవేత్త గౌతం కిచ్లూను పెళ్లాడింది. ఈ జంటకు ఓ మగబిడ్డ కూడా జన్మించాడు. పెళ్లి తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న కాజల్‌కి ఛాన్సులు తగ్గిన మాట వాస్తవమే. జూన్ 7న 'సత్యభామ'(Sathyabhama) సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్.. సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వరని తెలిపింది.
అదే బాలీవుడ్‌లో(Bollywood) మాత్రం పెళ్లయినా తర్వాత కూడా హీరోయిన్లుగా నటిస్తుంటారు. షర్మిళా ఠాకుర్, హేమమాలిని, దీపికా పదుకొణె(Deepika padukone), ఆలియా భట్(Aliabhat) లాంటి వాళ్లకు బాలీవుడ్‌లో హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి. కానీ సౌత్ ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి ఉండదని ఇంటర్వ్యూలో తెలిపింది. అయితే దక్షిణాదిలో నెలకొన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం' అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది. తెలుగు మాట్లాడగలిగే నటులకే ఇక్కడి ప్రేక్షకులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని.. అప్పట్లో ఇలా ఉండేది కాదు కదా అని ప్రశ్నించగా కాజల్ స్పందించారు. తన విషయంలో అలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. ప్రేక్షకులు ఎంతో సపోర్ట్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. నటనకు భాష అవసరంలేదని, అయినా నేర్చుకునేందుకు తన వంతు ప్రయత్నం చేశానని, ఇంకా చేస్తూనే ఉన్నానని తెలిపారు.