అగ్రశ్రేణి కథానాయికగా ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్ సినిమాకు కాసింత బ్రేక్‌నిచ్చి తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల కిందట జరిగిన వీరి పెళ్లికి గుర్తుగా నీల్ అనే కొడుకు పుట్టాడు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు.
అగ్రశ్రేణి కథానాయికగా ఉన్న సమయంలోనే కాజల్ అగర్వాల్ సినిమాకు కాసింత బ్రేక్‌నిచ్చి తన బాయ్‌ఫ్రెండ్ గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్నారు. మూడేళ్ల కిందట జరిగిన వీరి పెళ్లికి గుర్తుగా నీల్ అనే కొడుకు పుట్టాడు. బిడ్డకు జన్మనిచ్చిన రెండు నెలలకే కాజల్ అగర్వాల్ మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈమె ఇండియన్-2 సినిమాలో లోకనాయకుడు కమలహాసన్ సరసన నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తెలుగులో బాలకృష్ణకు జోడిగా భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తున్నారు. తనకు శివభక్తి ఎక్కువని ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారామె! ఎక్కువగా శివుడినే కొలుస్తారట.! అందుకే తన బిడ్డకు శివుడు పేరు పెట్టాలని ముందుగానే నిర్ణయించుకున్నానని ఆమె తెలిపారు. బిడ్డ పుట్టిన తర్వాత పిలవడానికి అనువుగా, రాయడానికి సులభంగా ఉండేలా పేరు పెడతామని తన భర్త చెప్పారన్నారు. అందుకే నీలకంఠుడైన శివుడి పేరులోని రెండు అక్షరాలను తీసుకుని నీల్ అనే పేరును తన కొడుకుకు పెట్టామని కాజల్ తెలిపారు. ప్రతి మహిళ జీవితంలో ఆ తొమ్మిది నెలలూ కీలకమైనవని, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఏవో సమస్యలు వెంటాడుతూనే ఉంటాయని అన్నారు. ముఖ్యంగా, డిప్రెషన్ లక్షణాలు ఆ తల్లిని చికాకు పరుస్తాయి. ప్రసవానంతర డిప్రెషన్ తననూ ఇబ్బంది పెట్టిందని కాజల్ తెలిపారు. ఇలాంటి సమయంలో అమ్మ, నాన్న, తోబుట్టువులు, జీవిత భాగస్వామి, స్నేహితుల మద్దతు చాలా అవసరమని, వారంతా ఆమె కోసం రోజూ కొంత సమయం కేటాయించాలని కాజల్ పేర్కొన్నారు. ఇంతకు ముందు చంటిపిల్లల తల్లులను చూసినప్పుడల్లా అద్భుతమైన అనుభూతి కలిగేదని, తాను తల్లినైన తర్వాత నీల్‌ను పెంచుతున్నప్పుడు అలాంటి అనుభూతినే అనుభవిస్తున్నట్టు తెలిపారు. కాసేపు కూడా బిడ్డను వదలలేకపోతున్నానని, షూటింగ్‌లకు, జిమ్‌లకు వెళ్లడం కష్టంగా ఉందని అన్నారు . అయితే ఇంటికి తిరిగి రాగానే బిడ్డ చిరునవ్వులు చూస్తే అప్పటి వరకు పడిన శ్రమ అంతా ఊఫ్ మంటూ ఎగిరిపోతుందని కాజల్ అగ్వారల్ తెలిపారు.