అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అంటారు. కానీ కొందరికి మాత్రం ఇవేమీ పట్టవు. డబ్బుకోసం అమ్మను కూడా రోడ్డుమీదకు నెట్టేసే కొడుకులను చూశాం. మద్యం మత్తులో తల్లిని చంపిన కసాయి కొడుకులను కూడా చూశాం. అలాంటి వాడే ఈ నటి కొడుకు కూడా! ఆ మధ్య తమిళంలో కడైసి వివాసాయి(Kadaisi Vivasai) (చివరి రైతు) అనే సినిమా వచ్చింది. ఇందులో విజయ్‌సేతుపతికి(Vijay sethupathi) తల్లిగా కాసమ్మళ్‌(Kasammal) నటించి మంచి పేరు తెచ్చుకుంది.

అమ్మను మించిన దైవం లేదంటారు. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అంటారు. కానీ కొందరికి మాత్రం ఇవేమీ పట్టవు. డబ్బుకోసం అమ్మను కూడా రోడ్డుమీదకు నెట్టేసే కొడుకులను చూశాం. మద్యం మత్తులో తల్లిని చంపిన కసాయి కొడుకులను కూడా చూశాం. అలాంటి వాడే ఈ నటి కొడుకు కూడా! ఆ మధ్య తమిళంలో కడైసి వివాసాయి(Kadaisi Vivasai) (చివరి రైతు) అనే సినిమా వచ్చింది. ఇందులో విజయ్‌సేతుపతికి(Vijay sethupathi) తల్లిగా కాసమ్మళ్‌(Kasammal) నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాతో పాపులరైన ఆమె హత్యకు గురయ్యింది. హత్య చేసింది ఎవరో కాదు. కన్న కొడుకు నామకోడినే ఆమెను కొట్టి దారుణంగా హత్య(Murder) చేశాడు. గత పదిహేనేళ్లుగా నామకోడి తల్లి దగ్గరే ఉంటున్నాడు. భార్యను ఎప్పుడో వదిలేశాడు. తల్లితో తరచూ గొడవపడేవాడు. ఫిబ్రవరి 4వ తేదీన కూడా ఇలాగే అమ్మతో వాగ్వాదానికి దిగాడు. మద్యం కోసం డబ్బలివ్వమని వేధించాడు. ఆమె ఇవ్వననేసరికి విచక్షణ కోల్పోయిన నామకోడి(Nama Kodi) చెక్కతో తల్లిపై దాడికి దిగాడు. దీంతో అమె అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. తమిళనాడులోని మదురైకి దగ్గరలో ఉన్న అనయ్యూర్‌లోని ఈ ఘటన జరిగింది. ఆమె సొంత ఇంట్లోనే ఆమె కన్నుమూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నామకోడిని అరెస్ట్‌ చేశారు. కాసమ్మాళ్‌, ఆమె భర్త దివంగత బాలసామి దంపతులకు నలుగురు పిల్లలు. అందులో నామకోడి ఒకరు. కడైసి వివాసాయి సినిమాకు మణికండాని దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును గెల్చుకుంది.

Updated On 8 Feb 2024 7:20 AM GMT
Ehatv

Ehatv

Next Story