ఇవాళ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు(K Raghavendra Rao) పుట్టినరోజు. తెలుగు సినిమాకు గ్లామర్‌ను అద్దిన ఆయన వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమారు అర్ధశతాబ్దం పాటు సినిమాలతో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌తో(NTR) తనకున్న సంబంధాన్ని చెప్పారు. తన జీవితం ఇలా ఉండటానికి ఎన్టీఆరే కారణమని వినమ్రంగా చెబుతారు రాఘవేంద్రరావు.

ఇవాళ దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు(K Raghavendra Rao) పుట్టినరోజు. తెలుగు సినిమాకు గ్లామర్‌ను అద్దిన ఆయన వందకుపైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. సుమారు అర్ధశతాబ్దం పాటు సినిమాలతో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీఆర్‌తో(NTR) తనకున్న సంబంధాన్ని చెప్పారు. తన జీవితం ఇలా ఉండటానికి ఎన్టీఆరే కారణమని వినమ్రంగా చెబుతారు రాఘవేంద్రరావు. అడవిరాముడు(Adavi Ramudu) సినిమాతో తన జీవితానికి బంగారుబాట వేశారని, ఆయన నటించిన చివరి చిత్రం మేజర్‌ చంద్రకాంత్‌కు(Major Chandhrakanth) కూడా దర్శకత్వం వహించే అవకాశం కలగడం తన అదృష్టమని అన్నారు. 'చరిత్ర సృష్టించడం ఎన్టీఆర్‌కే సాధ్యం. ప్రపంచ సినీ చరిత్రలో ఆయన పోషించినన్ని పాత్రలు మరెవ్వరూ వేయలేదు. వేయలేరు కూడా! పార్టీని స్థాపించిన తొమ్మిది నెలలోనే అధికారంలోకి రావడం ఆయనకే సాధ్యం.

దేశంలోని అన్ని పార్టీ నేతలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఆయన. శ్రీరాముడు పాదాల మీద కన్నీటి చుక్క ఆయన. ఈ విషయం నా ప్రేమలేఖ పుస్తకంలో కూడా రాశాను. అడవి రాముడు సినిమాలో కృషి ఉంటే మనుషులు రుషులవుతారు పాటలో వివిధ గెటప్పుల్లో ఎన్టీఆర్‌ను చూపించాను. మళ్లీ నాకు అవకాశం వస్తుందో రాదో అని శ్రీరాముడి వేషం కూడా వేయించాను. నా దృష్టిలో రాముడంటే ఎన్టీఆరే! రాముడు పాదాలకు నమస్కరించే సన్నివేశాన్ని చేసి చూపిస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ పాదాల మీద నా కళ్ల నుంచి రెండు కన్నీటి చుక్కలు పడ్డాయి. ఆ రోజు షూటింగ్‌ పూర్తయ్యాక వెళుతూ వెళుతూ బ్రదర్‌ ఇట్స్‌ ఏ గ్రేట్ మెమోరీ ఇన్‌ మై లైఫ్‌ అని చెప్పారు ఎన్టీఆర్‌. అంతకు మించిన గొప్ప ప్రశంస నా జీవితంలో లేదు' అని ఎన్టీఆర్‌ గురించి చాలా గొప్పగా చెప్పారు రాఘవేంద్రరావు.

Updated On 23 May 2023 1:21 AM GMT
Ehatv

Ehatv

Next Story