మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట! ఇందులో నిజమెంతో తెలియదు కానీ అప్పుడప్పుడు డబుల్‌ రోల్‌లాంటి మనుషులు తారసపడుతుంటారు. ఇటీవల ఓ తమిళ సినిమాలో సిల్క్‌ స్మితను(Silk Smitha) పోలిన అమ్మాయి తళుక్కుమన్నది కదా! ఇప్పుడలాగే అచ్చంగా సౌందర్యలాగే(Soundharya) ఉన్న ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో(social media) సంచలనం రేపుతోంది. మలేషియాకు చెందిన ఈమె పేరు చిత్ర(Chitra).

మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట! ఇందులో నిజమెంతో తెలియదు కానీ అప్పుడప్పుడు డబుల్‌ రోల్‌లాంటి మనుషులు తారసపడుతుంటారు. ఇటీవల ఓ తమిళ సినిమాలో సిల్క్‌ స్మితను(Silk Smitha) పోలిన అమ్మాయి తళుక్కుమన్నది కదా! ఇప్పుడలాగే అచ్చంగా సౌందర్యలాగే(Soundharya) ఉన్న ఓ అమ్మాయి సోషల్‌ మీడియాలో(social media) సంచలనం రేపుతోంది. మలేషియాకు చెందిన ఈమె పేరు చిత్ర(Chitra). టిక్‌టాక్‌ ఉన్న సమయంలోనే సోషల్‌ మీడియాలో స్టార్‌గా ఎదిగింది. సేమ్‌ టు సేమ్‌ సౌందర్యలాగే ఉండటంతో ఆమెకు ఫాలోవర్స్‌ అమాంతం పెరిగారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా మన దేశంలోని అభిమానులకు కూడా చిత్ర దగ్గరయ్యింది. లేటెస్ట్‌గా ఓ ఇంటర్వ్యూలో చిత్ర తన గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. చిత్ర అమ్మవాళ్లది తమిళనాడు అట! చిత్ర పుట్టి పెరిగింది మాత్రం మలేషియాలోనేనట(Maleshiya)! తనకు తమిళంతో పాటు కన్నడ, తెలుగు భాషలు కూడా వచ్చని చెప్పారు చిత్ర. సౌందర్యలాగే ఉండటం తన అదృష్టమని, మలేషియా నుంచే తాను రీల్స్‌ చేస్తున్నానని చిత్ర వివరించారు. 'సినిమాల్లో నటించమని కొంతమంది తెలుగువాళ్లు నాకు కాల్స్‌ చేశారు. నాకు నటించడం తెలియదు. సౌందర్య నటించిన అమ్మోరు, అంత:పురం సినిమాలంటే నాకు ఇష్టం. సౌందర్య కుటుంబ సభ్యులు ఎవరు నాకు ఫోన్ చేయలేదు' అని చిత్ర చెప్పుకొచ్చారు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు తెలిపారు.

Updated On 31 Oct 2023 5:18 AM GMT
Ehatv

Ehatv

Next Story