గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(JR.NTR) రేంజ్ ఏమిటో ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాతో ప్రపంచానికి తెలిసింది. తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును(Oscar Award) కూడా వీరి పాట గెల్చుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కంటే ముందు నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు. రక్తం పంచుకుని పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగే ఉంటారు.
గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్(Ram Charan), జూనియర్ ఎన్టీఆర్(JR.NTR) రేంజ్ ఏమిటో ఆర్‌ఆర్‌ఆర్(RRR) సినిమాతో ప్రపంచానికి తెలిసింది. తెలుగు సినిమా సత్తా చాటుతూ ఆస్కార్ అవార్డును(Oscar Award) కూడా వీరి పాట గెల్చుకుంది. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా కంటే ముందు నుంచే వీరిద్దరు మంచి స్నేహితులు. రక్తం పంచుకుని పుట్టకపోయినా అన్నదమ్ముల్లాగే ఉంటారు. ఇద్దరిలో ఎవరిదైనా పుట్టినరోజు వస్తే ఇంట్లో వారికి తెలియకుండా ఇద్దరం బయటకు చెక్కేస్తామని వారు చాలా సందర్భాలలో చెప్పారు. అంతటి ఫ్రెండ్‌షిప్ వీరిది.
చరణ్ తండ్రి కాబోతున్న విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయకముందే మొదట ఎన్టీఆర్‌కు ఫోన్ చేసి తన ఆనందాన్ని పంచుకున్నట్టు ఓ ఇంటర్వ్యూలో రామ్‌చరణ్ చెప్పాడు. వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఉంది కాబట్టే రాజమౌళి(Rajamouli) ఆర్‌ఆర్‌ఆర్ సినిమాను ఈజీగా తీయగలిగాడు. రామ్‌చరణ్-ఉపాసన దంపతులకు పెళ్లయిన పదేళ్ల తర్వాత వారు తల్లిదండ్రులు కావడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఎంతో సంతోషంతో ఉన్నారు. ఇప్పటికే ఆ పాపకు క్లీంకార(Klin Kara) అని అమ్మవారి పేరు పెట్టారు.
మెగా ఫ్యామిలీతో పాటు ఉపాసన కుటుంబం కూడా చరణ్-ఉపాసన దంపతుల గారాలపట్టికి బహుమతులు భారీగానే అందాయి. ఇక ఎన్టీఆర్ అయితే క్లీంకార కోసం ప్రత్యేకమైన బహుమతిని అందించారు. ఆ కానుకను కూడా తారక్ పిల్లలు అభయ్, భార్గవ్ రామ్‌లు ఎంతో ఇష్టంగా అందించినట్టు చెబుతున్నరు. రామ్‌చరణ్, ఉపాసన, క్లీంకార ముగ్గురి పేరుతో ఉన్న బాంగారు డాలర్స్‌ను అద్భుతమైన డిజైన్‌లో తయారు చేయించి కానుకగా పంపించారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమే అయిఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఎందుకంటే రామ్‌చరణ్-ఎన్టీఆర్ ఫ్రెండ్‌షిప్ అలాంటిది.